Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 4న వస్తున్న 'ఆచార్య' - క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (07:46 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కాంబినేషన్‌లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య". ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఫిబ్రవరి 4వ తేదీనే రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించి, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 
 
నిజానికి జనవరి 7వ తేదీన 'ఆర్ఆర్ఆర్' చిత్రం విడుదలవుతుంది. ఆ తర్వాత సంక్రాంతి రేస్‌లో 'భీమ్లా నాయక్', 'రాధేశ్యామ్', 'సర్కారువారిపాట' వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. దీంతో 'ఆచార్య' చిత్రాన్ని మరోమారు వాయిదావేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టాయి.
 
వీటిపై చిత్ర బృందం ఓ క్లారిటీ ఇచ్చింది. 'ముందుగా ప్రకటించినట్టుగా ఫిబ్రవరి 4వ తేదీన చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. అందరి అంచనాల్ని అందుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దాం' అని చిత్ర బృందం తెలిపింది. 
 
కాగా, ఈ చిత్రంలో చిరంజీవి ఆచార్యుడుగాను, నక్సలైట్‌గా రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. అలాగే, ఆచార్యకు అండదండలు అందించే పాత్రలో ఆయన తనయుడు రామ్ చరణ్ ఓ కీలకమైన సిద్ధ పాత్రలో కనిపించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు.. మే 15 నుండి మే 26 వరకు 12 రోజుల పాటు...

తూచ్.. అదంతా ఫేక్ : రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన అయోధ్య రామిరెడ్డి (Video)

సూర్యాపేటలో పరువు హత్య.. కులాంతర వివాహం చేసుకున్నాడని కొట్టి చంపారు..

పరాయి మహిళ మోజులోనే గురుమూర్తి ఘాతుకం!

Amazon: అమేజాన్ విధానాలపై పవన్ అసంతృప్తి.. గిఫ్ట్ కార్డుల నుండి డబ్బు.. ఇంత కష్టమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments