Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

దేవీ
గురువారం, 26 జూన్ 2025 (17:53 IST)
Rajinikanth Coolie Chikitu Song
సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ 'కూలీ'కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు.
 
తాజాగా డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇది ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న మ్యాసీవ్ హైప్‌ను సూచిస్తోంది.  LCU చిత్రాలన్నీ గతంలో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన నేపథ్యంలో హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడింది.
 
రజనీకాంత్, నాగార్జునలతో పాటు సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేయనుంది.
 
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ క్రేజ్‌ను నెలకొల్పాయి. తాజాగా విడుదలైన మాస్ సాంగ్ ‘చికిటు’ అదరగొట్టింది. ఆనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ పాటలో ఆయన స్వరాలతో పాటు అరివు కూడా పాటను హై ఎనర్జీగా పాడారు. పాటలో టి. రాజేందర్ సౌండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ డాన్స్‌, విజువల్స్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్‌లా ఉన్నాయి. ఈ పాటకు శ్రీనివాస మౌళి సాహిత్యం అందించారు.
 
కలానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాప్  టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. ఆనిరుధ్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్. ఈ చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments