హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ‘ఛత్రపతి’ సెట్‌

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (17:08 IST)
gada, srinivas, vinayak
హైద‌రాబాద్‌లో గ‌త రెండు రోజులు ప‌లుచోట్ల ఉరుములు, మెరుపులలు ఈదురు గాలుల‌తో భారీ వ‌ర్షం ప‌డింది. మంగ‌ళ‌వారంనాడు విప‌రీతంగా ఈదురుగాలులు వీచాయి. అయితే ఈ ఎఫెక్ట్ వివి వినాయ‌క్ చేయ‌బోతున్న `ఛ‌త్ర‌ప‌తి` హిందీ రీమేక్ సినిమాపై ప‌డింది. అదెలాగంటే ఈ సిసిమా హిందీ రీమేక్‌ షూటింగ్‌ను ఏప్రిల్‌ 22న మొదలు పెట్టాలనుకున్నారు. ఇందుకోసం 3 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆరు ఏకరాల్లో ఆర్ట్‌ డైరెక్టర్‌ సునీల్‌బాబు ఓ విలేజ్‌ సెట్‌ను జూబ్లీహిల్స్‌లోని రంగ‌స్థ‌లం వేసిన సెట్ ప‌రిస‌రాల్లో ఏర్పాటు చేశారు. 
 
‘రంగస్థలం’ విలేజ్‌ సెట్‌ను కూడా అప్పట్లో ఇదే లొకేషన్‌లో క్రియేట్‌ చేశారు. దురదృష్టవశాత్తు కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు, లాక్‌డౌన్‌ వంటి కారణాలతో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ షూటింగ్‌ను అనుకున్న సమ యానికి ప్రారంభించలేకపోయారు. ఈ లోపు 3కోట్ల రూపాయలతో వేసిన సెట్‌ ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల తాకిడికి తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఈ సెట్‌ను పునరుద్దరించే పనిలో పడ్డారు ఆర్ట్‌ డైరెక్టర్‌ సునీల్‌ బాబు అత‌ని సిబ్బంది. ఈ సెట్‌ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించ‌నున్నారు మేక‌ర్స్‌. 
 
భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సరికొత్త అవతారంలో కనిపించ నున్నారు. ఈ సినిమా టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్రయూనిట్‌ పేర్కొంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్ ప‌తాకంపై డా. జ‌యంతిలాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు ‘ఛత్రపతి’ చిత్రానికి కథ అందించిన రాజమౌళి తండ్రి, ప్రముఖ దర్శక–రచయిత కేవీ విజయేంద్రప్రసాద్ హిందీ ‘ఛత్రపతి’ రీమేక్‌కు స్క్రిప్ట్‌ అందిస్తున్నారు. 
 
ప్రభాస్‌ హీరోగా ద‌ర్శక‌ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఛత్రపతి’. 2005లో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించి స్ట‌న్నింగ్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ‘బాహుబలి’ కంటే ముందు ప్రభాస్‌ను ఛత్రపతి శివాజీగా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో చూపించి ప్రేక్షకులను మెస్మ‌రైజ్ చేశారు రాజమౌళి. ఈ మూవీ వీరిద్ద‌రి కెరీర్స్‌ని మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments