ఎక్మో సపోర్టుతో ఎస్పీ బాలు ఆరోగ్యం... మెరుగుపడకపోయినా.. నిలకడగా...

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (19:10 IST)
కరోనా వైరస్ బారినపడిన సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణం ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. ఆయన ప్రస్తుతం ఎక్మోసపోర్టుతో ప్రత్యక ఐసీయు వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిపుణులైన ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. 
 
తాజాగా ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై చెన్నై ఎంజీఎం ఆసుపత్రి ఈ సాయంత్రం బులెటిన్ వెలువరించింది. ఎస్పీ బాలు ఇంకా ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పైనే ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పు లేదని, నిలకడగానే వుందని ఆ బులెటిన్‌లో తెలిపారు.
 
బాలు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, విభిన్న వైద్య విభాగాల నిపుణులతో కూడిన తమ వైద్య బృందం అహర్నిశలు బాలు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ఆయన శరీరంలో కీలక అవయవాల స్పందనను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటోందని బులెటిన్‌లో వివరించారు. బాలు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments