Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత-నాగచైతన్య వెడ్డింగ్... ఫోటోలు వచ్చేస్తున్నాయ్...

సమంత-నాగచైతన్య పెళ్లి గోవాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడికి వచ్చిన అతిథులతో సమంత సెల్ఫీలు దిగుతోంది. ఇక నాగచైతన్య-సమంతలు కలిసి దిగిన ఫోటోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు సమంత మరికొన్ని గంటల్లో తన కోడలు కాబోతోందంటూ నాగార్జున ట్వీట్ చేశారు.

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (21:22 IST)
సమంత-నాగచైతన్య పెళ్లి గోవాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడికి వచ్చిన అతిథులతో సమంత సెల్ఫీలు దిగుతోంది. ఇక నాగచైతన్య-సమంతలు కలిసి దిగిన ఫోటోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు సమంత మరికొన్ని గంటల్లో తన కోడలు కాబోతోందంటూ నాగార్జున ట్వీట్ చేశారు.
 
''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా జంటగా నటించిన సమంత, నాగ చైతన్యలకు వివాహ వేదికపై స్పెషల్ సర్‌ప్రైజ్ రెడీ అవుతోంది. శుక్రవారం గోవాలో నిరాడంబరంగా చైతూ, సమ్మూ వివాహం జరుగనుంది. ఈ నేపధ్యంలో అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం కలసి సమంతకు వెల్‌కమ్ చెబుతూ ఓ చిన్న వీడియోను రూపొందించారు. 
 
వివాహం జరుగుతున్నప్పుడు ప్రదర్శించేందుకు ఈ వీడియోను రూపొందించారని, దీని గురించి సమంత, చైతూలకు తెలియదని సమాచారం. సమంతకు సర్‌ప్రైజ్‌గా ఈ వీడియోను కానుకగా ఇవ్వాలని భావించిన రెండు ఫ్యామిలీలూ ఆమెకు స్వాగతం చెబుతూ కనిపిస్తాయట. ఈ వీడియోలో అక్కినేని నాగార్జున, అమల, అఖిల్‌తో పాటు రానా, సుమంత్ ఇందులో కనిపిస్తారని సమాచారం.
 
ఈ వీడియో సమంతకు స్వీట్ షాకింగ్‌గా వుంటుందని వారి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అలాగే నాగార్జున కూడా సమ్మూ-చైతూ కోసం అన్నపూర్ణ స్టూడియోలో కొత్త కాటేజీ కట్టిస్తున్నారని.. ఇందులో అత్యాధునిక పరికరాలు.. విదేశీ వస్తువులను వుంచినట్లు తెలుస్తోంది.
 
ఇక ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా చైతూ జంటకు శుభాభినందనలు చెబుతూ కామెంట్ల వరద పారిస్తున్నారు. 'ఏమాయ చేశావే' దర్శకుడు గౌతమ్ మీనన్ ను ప్రస్తావిస్తుండటం విశేషం. వీరిద్దరి ప్రేమకు బీజం వేసింది గౌతమేనని, ఆయన ఫోటోను పూజ గదిలో పెట్టుకుని జీవితాంతం పూజించుకోవాలని సలహాలు కూడా ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

కుమారుడిని చంపేందుకు లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చిన తండ్రి

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments