మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కూడా ఈ మధ్య సెలబ్రెటి అయిపోయింది. గతంలో కేవలం టాప్ రిచ్ క్లాస్ సర్కిల్స్‌లోనే అపోలో డైరెక్టర్‌గా పాపులర్ అయిన ఉపాసన ఆ తర్వాత మెగా ఇంటి కోడలుగా తెలుగు వాళ్ళకు దగ్గరైంది. మెగా కోడలు అవ్వకముందే ఉపాసన అపోలో లైఫ్ విభాగానికి డైరెక్టర్, అలాగే బి పాజిటివ్ అనే మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా చాలా పాపులర్. అయితే తాజాగా అపోలో లైఫ్ వారు తయారు చేస్తున్న పలు రకాల ప్రొడక్ట్స్‌కి టీవీలో యాడ్స్ వస్తుంది.
ఈ ప్రకటనల్లో ఉపాసన నటిస్తోంది. ఏంటి మెగా కోడలు యాడ్‌లో నటిస్తోందా? అని ఆశ్చర్యపోతున్నారా.. నిజానికి ఈ యాడ్‌లో ఉపాసన డైరెక్టుగా కనిపించకపోయినా చివరలో ఉపాసన ఫోటోతో పాటు సైన్ కూడా వేసి ఈ ప్రొడక్ట్స్‌ని వాడండి అంటూ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. మొత్తంగా ఈ రకంగా మెగా కోడలు ఉపాసన కూడా యాడ్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ విధంగా చూస్తే రామ్ చరణ్ ఉపాసనలు కలిసి అపోలో కోసం ప్రకటన కోసం కలిసి నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.