Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నవాడి దర్శకుడితో చక్రి చిగురుపాటి చిత్రం!

పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని సైతం తట్టుకొని చాలా పెద్ద విజయం సాధించే దిశగా దూసుకుపోతున్న "ఎక్కడికీ పోతావు చిన్నవాడా" చిత్ర దర్శకుడు వి.ఐ.ఆనంద్ ఆ సినిమా విడుదలైన రెండో రోజే తన తదుపరి చిత్రాన్ని అఫీషియ

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (18:23 IST)
పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని సైతం తట్టుకొని చాలా పెద్ద విజయం సాధించే దిశగా దూసుకుపోతున్న "ఎక్కడికీ పోతావు చిన్నవాడా" చిత్ర దర్శకుడు వి.ఐ.ఆనంద్ ఆ సినిమా విడుదలైన రెండో రోజే తన తదుపరి చిత్రాన్ని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశారు. నిఖిల్‌కు "స్వామి రారా" వంటి సూపర్ హిట్‌ను నిర్మించిన యువ నిర్మాత చక్రి చిగురుపాటి వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. రాజేష్ దండా నిర్మాణ సారథిగా వ్యవహరించనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. 
 
ఇటీవలే "లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్మెంట్స్" బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.4గా "నా పేరు శివ" ఫేమ్ సుశీంద్రన్ దర్శకత్వంలో సందీప్ కిషన్-మెహరీన్ కాంబినేషన్‌లో ఓ చిత్రం ప్రారంభించడం తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ మొదటివారంలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం అనంతరం తమ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.5గా.. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో ఓ ప్రముఖ యువ కథానాయకుడు నటించనున్నాడని, హీరోయిన్‌తో పాటు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రస్తుతం జరుగుతోందని సహ నిర్మాత రాజేష్ దండా తెలిపారు. 
 
వీలైనంత త్వరగా ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి డిసెంబర్ నెలాఖరుకు లేదా వచ్చే ఏడాది ప్రారంభ మాసంలో రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించనున్నామని నిర్మాత చక్రి చిగురుపాటి చెబుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Madhavi Latha: తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి సినిమాల్లోకి రాకండి.. మాధవీ లత

పవన్ కల్యాణ్‌కు తలనొప్పి తెస్తున్న రేవ్ పార్టీలు.. మళ్లీ కొత్త కేసు.. ఎక్కడ?

Kumari Aunty : కుమారి ఆంటీ వ్యాపారంతో ట్రాఫిక్ జామ్.. వారం పాటు బంద్..

చైనాను చుట్టేస్తున్న HMPV వైరస్, లక్షణాలేంటి? భారత్ పరిస్థితి ఏంటి?

Namma Yatri Auto Issue: నమ్మ యాత్రి ఆటో ఇష్యూ.. నా భార్య ఆటో నుంచి దూకేసింది.. భర్త ఆవేదన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments