సెన్సార్ పూర్తయి విడుదలకు సిద్ధ‌మైన 6జర్నీ

డీవీ
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (14:26 IST)
6Jarnee team
రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘6జర్నీ’.  బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌కు సిద్ధ‌మైన ఈ సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే  టీజ‌ర్‌ను పటేల్ రమేష్ రెడ్డి విడుద‌ల చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా టేస్టీ తేజ మాట్లాడుతూ,  బిగ్ బాస్ షోకి వెళ్లక ముందే ఈ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ నుంచి వచ్చాక కూడా మళ్లీ షూట్‌లో పాల్గొన్నాను. నాకు ఈ టీం ఎంతో సహకరించింది. కొత్త వాళ్లతో చేస్తున్న ఈ సినిమా కోసం మా రవి అన్న బడ్జెట్ గురించి ఎక్కడా ఆలోచించలేదు’ అని అన్నారు.బషీర్ ఆలూరి దర్శకత్వం లో నటించడం చాలహ్యాపీగా అనిపించింది అన్నారు.
 
పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా టీజర్‌ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నిర్మాత రవి ప్రకాష్ రెడ్డి, దర్శకుడు బషీర్ మూవీని తెర‌కెక్కించిన విధానం బావుంది. ఆయ‌న‌తో పాటు సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. టీజర్ చాలా బాగుంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
దర్శకుడు బసీర్ మాట్లాడుతూ, టేస్టి తేజ ఎనర్జీతో నటించాడు. మాకు సింహ మంచి పాటలు ఇచ్చారు. సురేందర్ రెడ్డి మా అందరికీ టీచర్. ఈ మూవీ ఇక్కడకు వచ్చిందంటే అది ఆయన వల్లే. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన మా నిర్మాతకు థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను నిర్మించడం, ఇందులో నటించడం ఆనందంగా ఉంది. అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది.  టీజర్ అందరికీ నచ్చేలా ఉంది. చిత్రం కూడా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
 
సమీర్ దత్త మాట్లాడుతూ, ఈ చిత్రంలో మంచి పాత్రను కూడా పోషించారు. బసీర్ గారు  సినిమాను అద్భుతంగా తీశారు. టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments