Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక సన్నివేశాల్లో కేథరిన్ ట్రెసా, సందీప్ మాధవ్ సినిమా

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (17:33 IST)
Catherine Tresa
కేథరిన్ ట్రెసా హీరోయిన్‌గా, జార్జిరెడ్డి, వంగవీటి చిత్రాల కథానాయకుడు సందీప్ మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రాన్ని కేసీఆర్ ఫిలిమ్స్, శ్రీమహా విష్ణు మూవీస్ బ్యానర్‌లపై దావులూరి జగదీష్, పల్లి కేశవరావులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది.  ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ  హీరో, హీరోయిన్‌లతో పాటు చిత్రంలోని ముఖ్యతారాగణంపై ప్రత్యేక వేసిన పోలీస్‌స్టేషన్ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతో పాటు త్వరలో భారీ ఖర్చుతో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం. స్క్రీన్‌ప్లే బేస్‌డ్ సినిమా ఇది. సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రమిది. 
 
దర్శకుడు మాట్లాడుతూ, ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. సినిమాలో వుండే ట్విస్ట్‌లు ఎవరూ ఊహించలేరు. పవర్‌ఫుల్ పోలీస్‌ఆఫీసర్‌గా సందీప్ మాధవ్ పాత్ర ఎంతో ఫెరోషియస్‌గా వుంటుంది. హీరోయిన్ కేథరిన్ పాత్రను కూడా దర్శకుడు ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని రీతిలో డిజైన్ చేశాం.  సినిమాకు మంచి టీమ్ కుదరింది అన్నారు.
 
శ్రీనివాస రెడ్డి, మధునందన్, రవికాలే, భానుశ్రీ, అత్విక్ మహారాజ్, దొరబాబు, బేబి కృతి, ఘట్టమనేని సాయిరేవతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, నిర్మాణ, నిర్వహణ: సోమ విజయ్‌ప్రకాష్, సహ నిర్మాతలు: గౌటి హరినాథ్, రొంగల శివశంకర్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments