Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవితో స్టెప్పులేయనున్న బన్నీ హీరోయిన్ కేథరిన్.. మాస్ మసాలా సాంగ్‌లో?

ఇద్దరమ్మాయిలతో సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన కేథరిన్ థ్రెసాకు బంపర్ ఆఫర్ వచ్చింది. కేథరిన్ గత అవకాశాల సంగతులు ఎలా వున్నా.. ఇప్పుడు ఏకంగా ఈ దుబాయ్ భామకి చిరంజీవితో స్టెప్పులు వేసే ఛాన్సొచ్చింది. చ

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (10:21 IST)
ఇద్దరమ్మాయిలతో సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన కేథరిన్ థ్రెసాకు బంపర్ ఆఫర్ వచ్చింది. కేథరిన్ గత అవకాశాల సంగతులు ఎలా వున్నా.. ఇప్పుడు ఏకంగా ఈ దుబాయ్ భామకి చిరంజీవితో స్టెప్పులు వేసే ఛాన్సొచ్చింది. చిరు 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150'లో ఓ మాస్ మసాలా సాంగ్ ఉంది. ఈ పాట కోసం క్రేజ్ ఉన్న హీరోయిన్‌ను తీసుకోవాలని భావించిన యూనిట్ సభ్యులకి తమన్నా మొదటి ఆప్షన్‌గా కనిపించింది.
 
కానీ ప్రస్తుతం తమన్నా బిజీగా ఉండడం వలన ఈ స్పెషల్ సాంగ్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోంది. దీంతో కేథరిన్ థ్రెసాను ఈ పాట కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ పాటలో చిరంజీవి తన గత చిత్రాల మాదిరిగా అదిరిపోయే స్టెప్పులేస్తున్నాడు. ఈ పాటే సినిమాకు హైలైట్ కానుందని తెలిసింది. ఇద్దమ్మాయిలు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన కేథరిన్ ఆ తర్వాత రుద్రమదేవి, సరైనోడు వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. 
 
ఈ పాటకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మంచి బీట్ తో మాస్ ట్యూన్‌ను చేస్తున్నాడు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో కొనసాగుతోంది. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments