Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పేకాట'ను ప్రోత్సహిస్తున్న హీరో రానా.. సామాజిక కార్యకర్త ఫిర్యాదు... కేసు నమోదు

వివాదాలకు దూరంగా ఉండే 'బాహుబలి' విలన్, హీరో దగ్గుబాటి రానా ఇపుడు వివాదంలో చిక్కుకున్నాడు. ఈయన పేకాట (రమ్మీ)ని ప్రోత్సహిస్తున్నారంటూ తమిళనాడు వాసి కేసు పెట్టాడు. దీంతో వివాదంలోకి రావాల్సిన పరిస్థితి ఏర

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (15:01 IST)
వివాదాలకు దూరంగా ఉండే 'బాహుబలి' విలన్, హీరో దగ్గుబాటి రానా ఇపుడు వివాదంలో చిక్కుకున్నాడు. ఈయన పేకాట (రమ్మీ)ని ప్రోత్సహిస్తున్నారంటూ తమిళనాడు వాసి కేసు పెట్టాడు. దీంతో వివాదంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన పి.ఇళగోవన్ అనే సామాజిక కార్యకర్త రానాపై కేసు పెట్టాడు. రానాతో పాటు ప్రకాష్ రాజ్‌పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 'రానా, ప్రకాష్ రాజ్‌లు పలు వెబ్‌సైట్ల ద్వారా గాంబ్లింగ్‌ను ప్రమోట్ చేస్తున్నారు. రమ్మీ ఆడేందుకు పురిగొల్పేలా ప్రకటనలు ఇస్తున్నారు. టీవీల్లోనూ అవి ప్రసారమవుతున్నాయి. వీరు ప్రచారం చేసే సైట్ సహా పలు వెబ్‌సైట్లు కూడా బెట్టింగ్‌కు పురిగొల్పుతున్నాయి' అంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 
 
కాగా, బెట్టింగ్, రమ్మీ, గాంబ్లింగ్‌లపై తమిళనాడు రాష్ట్రంలో నిషేధం ఉండటంతో ఇళగోవన్ ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దీంతో భల్లాల దేవుడికి తిప్పలు తప్పేలా లేవు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments