Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గరుడవేగ' హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తెపై కేసు

'పీఎస్వీ గరుడవేగ' చిత్రం విజయోత్సవంలో మునిగితేలుతున్న హీరో రాజశేఖర్‌, జీవిత రాజశేఖర్‌ దంపతులకు ఇది నిజంగానే చేదువార్త. ఈ దంపతుల పెద్ద కుమార్తె శివాని తన వాహనంలో ప్రయాణిస్తూ.. నిలిపి ఉంచిన మరో కారును ఢ

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (11:41 IST)
'పీఎస్వీ గరుడవేగ' చిత్రం విజయోత్సవంలో మునిగితేలుతున్న హీరో రాజశేఖర్‌, జీవిత రాజశేఖర్‌ దంపతులకు ఇది నిజంగానే చేదువార్త. ఈ దంపతుల పెద్ద కుమార్తె శివాని తన వాహనంలో ప్రయాణిస్తూ.. నిలిపి ఉంచిన మరో కారును ఢీకొట్టిన విషయం తెల్సిందే. ఇది శనివారం జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 5లో జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. 
 
అయితే తన కారు పూర్తిగా డ్యామేజీకావడంతో బాధితుడు తనకు రూ.30 లక్షలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. శివానీ తల్లి జీవిత వచ్చి బాధితునితో మాట్లాడి సమస్యను సానుకూలంగా పరిష్కరించుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. 
 
మరోవైపు కారు డ్యామేజ్‌కి సంబంధించి ఎస్‌పీవీఎస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ సీనియర్‌ ఆపరేషనల్‌ మేనేజర్‌ అశోక్‌‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివానిపై కేసు నమోదు చేశారు. కాగా, శివానీ వైద్య కోర్సు చదువుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో గుడివాడ యువకుడు ఆత్మహత్య

సూప్‌లో ఎలుకపడింది... ఆ రెస్టారెంట్ షేర్లు పతనమయ్యాయి...

Telangana: తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు : ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments