Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఠాణాకు చేరిన టీవీ పంచాయ‌తీలు... జీవితా రాజ‌శేఖ‌ర్ కార్య‌ద‌ర్శుల‌పై కేసు

హైద‌రాబాద్: నువ్వు మా స్టూడియోకు వ‌స్తావా? రావా? ప‌ంచాయ‌తీ చేయాలి... అంటూ ఓ ఆటో డ్రైవ‌ర్‌ని వేధిస్తున్నార‌ని జీవిత రాజ‌శేఖ‌ర్ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శుల‌పై కేసులు న‌మోద‌య్యాయి. చిల‌క‌ల‌గూడ పోలీస్ స్టేష‌న్లో వీరిపై కేసు న‌మోద‌యింది. బ‌తుకు జ‌ట్కా బండి.

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (17:33 IST)
హైద‌రాబాద్: నువ్వు మా స్టూడియోకు వ‌స్తావా? రావా? ప‌ంచాయ‌తీ చేయాలి... అంటూ ఓ ఆటో డ్రైవ‌ర్‌ని వేధిస్తున్నార‌ని జీవిత రాజ‌శేఖ‌ర్ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శుల‌పై కేసులు న‌మోద‌య్యాయి. చిల‌క‌ల‌గూడ పోలీస్ స్టేష‌న్లో వీరిపై కేసు న‌మోద‌యింది. బ‌తుకు జ‌ట్కా బండి... అనే టీవీ పంచాయ‌తీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు... జీవిత రాజ‌శేఖ‌ర్. 
 
ఇటీవ‌ల హైద‌రాబాదులోని పార్శీగుట్ట‌కు చెందిన ఒక ఆటో డ్రైవ‌ర్ పి. కొండను బ‌తుకు జ‌ట్కాబండి పంచాయ‌తీకి రావాల‌ని వీరిద్ద‌రు బెదిరించారు. కొండ త‌న భార్య జ్యోతితో గొడ‌వ‌ప‌డి, పెద్ద‌ల స‌మ‌క్షంలో విడిపోయారు. దీనికోసం జ్యోతికి కొండ ల‌క్ష రూపాయ‌లు ఇచ్చాడు. పెద్ద‌ల స‌మ‌క్షంలో సంత‌కాలు చేసుకుని వీరిద్ద‌రు విడిపోయారు. 
 
ఇపుడు జ్యోతి బ‌తుకు జ‌ట్కా బండి నిర్వాహ‌కురాలు జీవిత రాజ‌శేఖ‌ర్‌ని క‌లిసింది. దీనితో ఆమె కార్య‌ద‌ర్శులు కొండ‌ను బ‌తుకు జ‌ట్కా బండి పంచాయ‌తీకి రావాల‌ని బ‌ల‌వంతం చేస్తున్నారు. దీనిపై కొండ పోలీస్ స్టేష‌న్లో కేసు పెట్టాడు. మరి దీనిపై ఏం జరుగుతుందో చూడాలి.

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments