Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెప్టెన్ మిల్లర్ లో ఘోర హర పాటలో అలరించనున్న శివ రాజ్ కుమార్, ధనుష్

Webdunia
బుధవారం, 3 జనవరి 2024 (15:39 IST)
Shivarajkumar- Dhanush
సూపర్ స్టార్ ధనుష్ నటిస్తున్న చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం థర్డ్ సింగిల్ 'ఘోర హర' పాటని విడుదల చేశారు.
 
సెన్సేషనల్ కంపోజర్ జివి ప్రకాష్ ఈ పాట కోసం పవర్ ప్యాక్డ్ నెంబర్ ని స్కోర్ చేశారు. రాకేందు మౌళి రాసిన ఇంటెన్స్ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటని హై ఎనర్జీ వోకల్స్ తో ఆలపించారు. పాటలో వింటేజ్ విజువల్స్  అద్భుతంగా వున్నాయి. ధనుష్ , శివ రాజ్ కుమార్ ల ప్రజెన్స్ ఎక్స్ ట్రార్డినరీగా వుంది. ఈ పాటలో ధనుష్ , శివ రాజ్ కుమార్ కలిసి డ్యాన్స్ చేయడం కన్నుల పండగలా వుంది.
 
 1930-40 బ్యాక్ డ్రాఫ్ లో హ్యుజ్ బడ్జెట్ తో ఈ  చిత్రం రూపొందుతోంది. డాక్టర్ శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ మోహన్ కథానాయిగా నటిస్తోంది. టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌ సహా నిర్మాతలు.
 
ఈ చిత్రానికి సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. టి రామలింగం ప్రొడక్షన్ డిజైనర్. బాహుబలి ఫ్రాంచైజీ, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాశారు. నాగూరన్ ఎడిటర్.
 
‘కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో జనవరి 12న ఏకకాలంలో గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీఎస్సీ నోటిఫికేషన్‌- 42 ఏళ్ల నుంచి 44కి వయోపరిమితి పెంపు

పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)

నర్సరీ పిల్లాడికి రూ. 2,51,000 ఫీజు, పాసైతే ఐఐటీ వచ్చినట్లేనట, హైదరాబాదులో అంతే...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments