Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్‌తో జతకట్టనున్న ప్రియాంక అరుళ్ మోహన్ (video)

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (12:21 IST)
"గ్యాంగ్‌లీడర్" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియాంక అరుళ్ మోహన్‌. మొదటి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత 'డాక్టర్', 'డాన్‌', 'ఈటీ' వంటి తమిళ డబ్బింగ్ సినిమాలతో మరింత చేరువైంది. 
 
ప్రస్తుతం ప్రియాంక స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. తాజాగా ఈమె మరో స్టార్ హీరోతో జతకట్టనుంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు. తమిళ నటుడు ధనుష్‌.
 
కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు ధనుష్‌. ఇటీవలే విడుదలైన "తిరు"తో వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇటీవలే ధనుష్ "కెప్టెన్ మిల్లర్" అనే గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ ఎంపికైంది. 
 
ఈ చిత్రం ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందట. ఇక టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించనున్నాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments