Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్త‌ల్లోకి వ‌చ్చిన బాల‌య్య టైటిల్... అది ఎవ‌రి కోస‌మో తెలుసా..?

Webdunia
సోమవారం, 13 మే 2019 (21:19 IST)
నంద‌మూరి న‌టసింహం బాల‌కృష్ణ హీరోగా త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జై సింహా అనే సినిమా రూపొందిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌ర‌ుగుతోంది. ఈ చిత్రాన్ని సి.కె. ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యానర్ పైన సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 17న ఈ సినిమాని ప్రారంభించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఈ సినిమా టైటిల్ రూల‌ర్ అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం ఏంటంటే... ఇటీవ‌ల ఫిల్మ్ ఛాంబ‌ర్లో సి.క‌ళ్యాణ్ ఈ టైటిల్‌ని రిజిష్ట‌ర్ చేయించారు. అందుచేత ఈ మూవీ కోస‌మే సి.క‌ళ్యాణ్ ఈ టైటిల్ రిజిష్ట‌ర్ చేయించార‌ని ప్రచారం జ‌రుగుతోంది. అయితే.. బాల‌య్య బోయ‌పాటితో ఓ సినిమా చేయ‌నున్నాడు. బోయ‌పాటి గ‌తంలో రూల‌ర్ అనే టైటిల్‌తో సినిమా చేయాల‌నుకున్నారు. 
 
బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్లో రూపొందే సినిమాని కూడా సి.క‌ళ్యాణ్ నిర్మించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే... రూల‌ర్ టైటిల్ బాల‌య్య కె.ఎస్.ర‌వికుమార్ మూవీ కోస‌మ‌ని కొంద‌రంటుంటే.. కాదు బాల‌య్య - బోయ‌పాటి సినిమా కోసం అని మ‌రికొంద‌రు అంటున్నారు. అందుచేత సి.క‌ళ్యాణ్ రిజిష్ట‌ర్ చేయించిన టైటిల్ బాల‌య్య‌, కె.ఎస్.ర‌వికుమార్ మూవీ కోస‌మా..? లేక బాల‌య్య‌, బోయ‌పాటి మూవీ కోస‌మా..? అనేది తెలియాల్సి వుంది..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments