Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ కళ్యాణ్‌కు సకాలంలో డబ్బులివ్వలేక పోవడం నా దురదృష్టం : నిర్మాత ప్రసాద్

'అత్తారింటికి దారేది' చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌పై ఆ చిత్ర హీరో పవన్ కళ్యాణ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేసిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో నటించినందుకు తనకు రెమ్యునర

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (13:24 IST)
'అత్తారింటికి దారేది' చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌పై ఆ చిత్ర హీరో పవన్ కళ్యాణ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేసిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో నటించినందుకు తనకు రెమ్యునరేషన్ చెల్లించలేదని పేర్కొంటూ నిర్మాతపై ఫిర్యాదు చేయగా, ఇది ఆనాడు ఫిల్మ్ నగర్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 
 
దీనిపై నిర్మాత ప్రసాద్ ఇపుడు స్పందించారు. ‘నేను పవన్‌గారికి డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం చేయడం నిజమే. అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. నేను ఆ సమయంలో అలాంటి పరిస్థితిలో ఉండడం నా దురదృష్టం. పవన్‌ నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు. నేనే ఇబ్బంది పడ్డాన’ని చెప్పాడు. 
 
‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు ముందు పవన్‌ కంప్లైంట్‌ చేయడం వల్ల ఇబ్బందులు పడ్డానని, అయితే అలాంటివి జరుగుతుంటాయని ఆయన వెల్లడించాడు. కాగా, ‘అత్తారింటికి దారేది’ సినిమాకు ముందు తలెత్తిన పైరసీ సంక్షోభం నుంచి తాను గట్టెక్కడానికి పవన్‌, త్రివిక్రమ్‌ ఎంతో సాయం చేశారని గుర్తు చేసుకున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments