Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓమ్ కార్ రియల్టర్స్ కేసు: సచిన్ జోషి అరెస్ట్

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (15:24 IST)
ప్రముఖ నటుడు అరెస్ట్ కావడం టాలీవుడ్‌లో కలకలం రేపుతుంది. 'ఒరేయ్ పండు', 'మౌనమేలనోయి', 'జాక్ పాట్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సచిన్ జోషిని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.

సచిన్ జోషిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈడీ విచారిస్తున్న ఓమ్ కార్ రియల్టర్స్ కేసులో జేఎం జోషి గ్రూప్ ప్రమేయాన్ని నిర్ధారించుకున్న ఈడీ అధికారులు, తదుపరి విచారణ కోసం సచిన్ జోషిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
 
ఓమ్ కార్ గ్రూప్ ప్రమోటర్లలో సచిన్ జోషి కూడా ఉన్నాడు. దాదాపు 100 కోట్ల రూపాయల నిధులను వీరు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. అంతకుముందు దాదాపు 18 గంటల పాటు సచిన్ జోషిని విచారించిన ఈడీ అధికారులు, ఆపై అరెస్ట్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఇకపోతే గోవాలో విజయ్ మాల్యా సొంతమైన కింగ్ ఫిషర్ విల్లాను గతంలో జోషి కొనుగోలు చేశాడు. దేశవ్యాప్తంగా రెస్టారెంట్‌లు, క్లబ్ లను కలిగివున్న ప్లేబాయ్ ఫ్రాంచైజీని కూడా నిర్వహిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments