Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ కళ్యాణ్ వల్లే ప్రత్యేక హోదాకు మద్దతిచ్చా: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌

హీరో పవన్ కళ్యాణ్‌ వల్లే ప్రత్యేక హోదాకు మద్దతిచ్చినట్టు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తెలిపారు. తెలంగాణకు చెందిన హీరో అయిన బర్నింగ్ స్టార్.. ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రెండు మూడు సార్లే వచ్చాడు.

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (10:29 IST)
హీరో పవన్ కళ్యాణ్‌ వల్లే ప్రత్యేక హోదాకు మద్దతిచ్చినట్టు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తెలిపారు. తెలంగాణకు చెందిన హీరో అయిన బర్నింగ్ స్టార్.. ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రెండు మూడు సార్లే వచ్చాడు. అయినప్పటికీ వైజాగ్‌కు హుద్‌హుద్‌ వచ్చినపుడు ఆర్థిక సాయం చేయడం, అక్కడే జరిగిన ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా నిలవడం చేశాడు. సంపూ ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడని అప్పట్లో విమర్శలు వినిపించాయి. 
 
ఈ విమర్శల గురించి ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు సంపూర్ణేష్‌ బాబు. ‘హుద్‌హుద్‌ వచ్చి వెళ్లిన తర్వాత వైజాగ్‌ను చూసి మనసు చలించిపోయింది. అందుకే ఏమీ ఆలోచించకుండా రూ.లక్ష ఇస్తానని ప్రకటించాను. అయితే నిజానికి నా వద్ద అంత డబ్బు లేదు. నా స్నేహితుల వద్ద కూడా అంత ఎమౌంట్‌ లేదు. దాంతో రెండు వారాల టైమ్‌ తీసుకుని అప్పు చేసి ఆ డబ్బు సీఎంగారికి అందచేశా. అది పబ్లిసిటీ కోసం చేసింది కాదు.
 
అదేవిధంగా ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ విషయంలో పవన్‌ కళ్యాణ్ స్పీచ్‌ల ద్వారా నేను ఉత్తేజితుడనయ్యాను. అందుకే వైజాగ్‌ వస్తానని మాటిచ్చాను. ఆ మాటకు కట్టుబడి వైజాగ్‌ వెళ్లాను. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో నన్ను అదుపులోకి తీసుకున్నారు. వైజాగ్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న పల్లెటూరిలోని స్టేషన్‌లో నన్ను బంధించారు. 
 
నిజానికి ఆ రోజు సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణానికి టికెట్‌ తీసుకున్నాను. నన్ను ఎప్పుడు విడిచిపెడతారని పోలీస్‌ వాళ్లను అడిగితే.. ‘మాకు తెలీదండి. సీపీగారు మీ మీద కోపంగా ఉన్నార’ని చెప్పాడు. చివరకు సాయంత్రం ఏడు గంటల సమయంలో నన్ను విడిచిపెట్టారు. రాత్రి పది గంటల ఫ్లైట్‌కు హైదరాబాద్‌ వచ్చాను. ఇదంతా నిజాయితీగా చేసింది. పబ్లిసిటీ కోసం కాద’ని చెప్పాడు సంపుర్ణేష్ బాబు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments