Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్ శిష్యుడుతో బంపర్ ఆఫర్ 2 : హీరో సాయిరామ్ శంకర్

డీవీ
గురువారం, 14 మార్చి 2024 (18:37 IST)
Sairam Shankar
‘బంపర్ ఆఫర్’ మూవీ నా బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్లు ఉండే చిత్రం. ఆ తర్వాత ఈ కథ నాకు అలా అనిపించింది. కామెడీ నాకు బాగా ఇష్టం. ‘వెయ్ దరువెయ్’ విషయానికి వస్తే ఇందులో 80 శాతం కామెడీ, చిన్న ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ ఉంటుంది అని హీరో సాయిరామ్ శంకర్ అన్నారు. 
 
తాజాగా సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో సాయిరామ్ శంకర్ పలు విశేషాలను తెలియజేశారు.
 
* ‘వెయ్ దరువెయ్’ అనేది కమర్షియల్ టైటిల్ అయినప్పటికీ దానికి జస్టిఫికేషన్ ఉంటుంది. అలాగే హీరో క్యారెక్టర్ జోవియల్‌గా ఉంటుంది. సమాజంలో ఓ సమస్యపై హీరో చేసే చిన్నపాటి పోరాటమే ఈ చిత్రం.
 
*నేను వరుస సినిమాలు చేస్తున్నాను. అయితే అవన్నీ రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. మార్చి 15న ‘వెయ్ దరువెయ్’ రిలీజ్ అయితే వచ్చే నెలలో ఒక పథకం ప్రకారం, మే నెలలో రీసౌండ్ రిలీజ్ అవుతుంది. ఈ మూడు మూవీస్ చేయటానికి ఐదేళ్ల సమయం పట్టింది. అందుకు కారణం మధ్యలో కోవిడ్ చాలా బాగా డిస్ట్రబ్ చేసేసింది. అలా కొన్ని పరిస్థితులతో కాస్త గ్యాప్ కనిపిస్తుంది.
 
* ఆడియెన్స్‌ను సినిమా ఎంగేజ్ చేస్తే చాలు. సినిమా సక్సెస్‌ను వాళ్లు డిసైడ్ చేస్తారు. ఫార్మేట్‌లతో వాళ్లకు సంబంధం ఉండదు.
* నాతో పాటు చాలా మంది స్టార్ యాక్టర్స్ నటించారు. సత్యం రాజేష్, సునీల్, చమ్మక్ చంద్ర, థర్టీ ఇయర్స్ పృథ్వీ, పోసాని, అదుర్స్ రఘు, కాశీ విశ్వనాథ్ అందరూ తమదైన నటనతో మెప్పిస్తారు.
 
 సునీల్ మెయిన్ విలన్. ఆయన బిజీగా ఉన్నప్పటికీ నేను స్పెషల్ గా వెళ్లి కలవటంతో డేట్స్ అడ్జస్ట్ చేసిచ్చారు. హీరోయిన్ యశ ఇందులో మంచి రోల్ చేసింది. ఇద్దరూ అట్యిట్యూడ్  ఉన్న పాత్రల్లో కనిపిస్తాం. హెబ్బా పటేల్ గారు ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తారు.
 
‘బంపర్ ఆఫర్ 2’ను ఎప్పుదనేది అనౌన్స్ చేస్తాం. తప్పకుండా సినిమా ఉంటుంది. కరోనా వేవ్స్ సమయంలో సినిమాను ఆపాం. త్రివిక్రమ్ గారి దగ్గర వర్క్ చేసే అశోక్ గారు కథను తయారు చేశారు. దాన్ని ఆయన ఇంకెవరికీ ఇవ్వను మీకే ఇస్తానని అన్నారు.
 
* అన్నయ్యను (పూరి జగన్నాధ్) నాతో సినిమా చేయాలని ఇబ్బంది పెట్టను. వీడికి ఇది అవసరం అనుకుంటే ఆయనే చేస్తారు. ప్రమోషన్స్ విషయంలోనూ అంతే. అని ముగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

మహిళలపై దాడి చేసిన వైకాపా నేతలను వదిలిపెట్టను : మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్

వైకాపాకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని లేదు.. 2027నాటికి పూర్తి: రామానాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments