Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్ ప్రాజెక్టు నుంచి బ్రహ్మీ తీసివేసింది నిజమేనా?

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (16:54 IST)
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం  కొంతకాలంగా సినిమాలు తగ్గించాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వయస్సు రీత్యా ప్రస్తుతం పరిమిత స్థాయిలో సినిమాలకు మాత్రమే టైం కేటాయిస్తున్నారు. ఈ సీనియర్ నటుడు నితిన్  హీరోగా నటిస్తోన్న మాచెర్ల నియోజకవర్గం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.
 
అయితే బ్రహ్మానందంను నితిన్ ఈ ప్రాజెక్టుకు నుంచి తొలగించినట్టు ఓ వార్త ఇపుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఎందుకు బ్రహ్మీని తీసివేశారనే దానిపై ఓ గాసిప్ కూడా చక్కర్లు కొడుతోంది. ఇటీవలే నితిన్ అండ్ టీం 10 రోజుల షూటింగ్ షెడ్యూల్‌లో భాగంగా వైజాగ్‌కు వెళ్లారు. ఇదే షెడ్యూల్‌లో బ్రహ్మానందం కూడా పాల్గొనాల్సి ఉంది. కానీ బ్రహ్మానందం అనుకున్న సమయానికి షూటింగ్‌కు రాకపోవడం, డైరెక్టర్ చెప్పినట్టు చేయకపోవడంతోనే ఆయనను సినిమా నుంచి తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అంతా చర్చించుకుంటున్నారు.
 
అయితే దీనిపై డైరెక్టర్ నుంచి మాత్రం ఎలాంటి కామెంట్ రాలేదు. ఈ చిత్రాన్ని నితిన్ ఫ్యామిలీ బ్యానర్ నిర్మిస్తోంది. బ్రహ్మానందం ప్రవర్తనతో విసుగుచెందిన నితిన్..ఆ భారాన్ని భరించలేకే ఆయనను పక్కకు పెట్టాడని వార్తలు వస్తున్నాయి. తాజా టాక్ ప్రకారం ఈ సినిమాకు బ్రహ్మీ ఒక్క రోజుకు రూ.5 లక్షలు పారితోషికం తీసుకుంటున్నాడట. అంటే 10 రోజులకు రూ.50 లక్షలన్నమాట.
 
పరిస్థితులను బట్టి ఈ మొత్తం రెమ్యునరేషన్‌ను నష్టపోయినా ఫరవాలేదని మేకర్స్ అనుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి నితిన్ ప్రాజెక్టు నుంచి బ్రహ్మీని తీసివేసింది నిజమేనా..? కాదా ..? అనే దానిపై ఎవరైనాస్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments