Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మానందంకు ప్రమోషన్.. బ్రహ్మీ తాతయ్యారు.. గౌతమ్‌కు పుత్రోత్సాహం..

మెగాస్టార్ 150వ సినిమా ఖైదీలో నటించిన హాస్య బ్రహ్మకు సినీ ఛాన్సులు అంతగా రాకపోయినా.. తాతగా మాత్రం ప్రమోషన్ వచ్చింది. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్- జోత్స్న దంపతులకు మంగళవారం మగబిడ్డ జన్మించాడు. మంగళవారం

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (09:33 IST)
మెగాస్టార్ 150వ సినిమా ఖైదీలో నటించిన హాస్య బ్రహ్మకు సినీ ఛాన్సులు అంతగా రాకపోయినా.. తాతగా మాత్రం ప్రమోషన్ వచ్చింది. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్- జోత్స్న దంపతులకు మంగళవారం మగబిడ్డ జన్మించాడు. మంగళవారం హనుమాన్ జయంతి కావడంతో పండగరోజు ఇంట్లో సంతోషం వెల్లివిరిసిందని.. మనవడి రాకతో మా ఇల్లు కలకలలాడుతుందని బ్రహ్మానందం తన ఆనందాన్ని కుటుంబసభ్యులు, బంధువులతో పంచుకొన్నాడు.
 
మనవడికి తాత పోలికలు ఎక్కువగా వున్నాయని సినీ జనం అంటున్నారు. పాత ఇంటికి వచ్చిన తర్వాత బ్రహ్మానందంకి బాగానే కలిసొచ్చిందని.. సన్నిహితులు చెప్తున్నారు. ఇకపోతే.. పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరోగా మారాడు గౌతమ్‌. ప్రస్తుతం మను అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు. చిత్రీకరణ దాదాపుగా పూర్తికావడంతో వచ్చే నెలలో రిలీజ్ చేసే అవకాశం వుంది. చాందిని చౌద‌రి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫ‌ణీంద్ర ద‌ర్శ‌కుడు. సినిమా హీరోగా అంతగా క్లిక్ కాని గౌతమ్.. తండ్ర‌య్యాకైనా జాత‌కం మారుతుందేమో చూడాలి.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments