రీసెంట్‌గా 'సరైనోడు' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన బోయపాటి శ్రీను బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో తన మార్కు ఎంటర్‌టైన్మెంట్‌తో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ కొత్త చిత్రాన్ని హై బడ్జెట్‌తో రూపొందించనున్నారు. తొలి చిత్రం అల్లుడు శీనుతో మాస్ హీరోగా తెలుగు సినిమాకు పరిచయమై తనను తాను ప్రూవ్ చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బోయపాటి చిత్రంలో సరికొత్త లుక్, క్యారెక్టర్‌తో కనపడనున్నాడు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.... 'బోయపాటి శ్రీను, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కాంబినేషన్‌లో మా ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈరోజు సినిమా లాంచనంగా ప్రారంభమైంది. ఈ నవంబర్ 16 నుండి హైదరాబాద్‌లో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం, రిషి పంజాబి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. త్వరలోనే మిగిలిన నటీనటులు వివరాలను తెలియజేస్తాం' అన్నారు.