Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను జీవించి ఉన్నంత వరకు ఆమె బయోపిక్ రాదు : నిర్మాత బోనీ కపూర్

ఠాగూర్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (13:48 IST)
అందాల నటి, తన భార్య దివంగత శ్రీదేవి బయోపిక్‌పై ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఆమె బయోపిక్ వెండితెరపై దృశ్యకావ్యంగా రాదని ఆయన తేల్చిచెప్పారు. బయోపిక్ అంటే నిజాలను వక్రీకరించే అవకాశం ఉందని, అందుకే తన భార్య ఆలోచనల ప్రకారం తన బయోపిక్ తీయడానికి తాను అంగీకరించబోనని చెప్పారు.
 
అజయ్ దేవగణ్ హీరో బోనీ కపూర్ తాజాగా నిర్మించిన చిత్రం "మైదాన్". ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బోనీ కపూర్ మాట్లాడుతూ, తన భార్య శ్రీదేవి వ్యక్తిగత జీవితానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేదని చెప్పారు. వ్యక్తిగత విషయాలను బయటకు తెలియాల్సిన అవసరం లేదని ఆమె చాలా స్పష్టంగా చెప్పేవారు. ఆమె ఆలోచనలను, వ్యక్తిత్వానికి తాను ఎంతో గౌరవిస్తాను, విలువనిస్తాను అని చెప్పారు. పైగా బయోపిక్ అంటే నిజాలను వక్రీకరించే అవకాశం ఉంది. అందుకే తన భార్య ఆలోచనలు ప్రకారం తన బయోపిక్ తీయడానికి తాను సమ్మతించబోనని చెప్పారు. 
 
కాగా, చాలా రోజులుగా శ్రీదేవి బయోపిక్‌ పేరుతో ఓ సినిమా తీయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయంపై బోనీ కపూర్‌తో కూడా సంప్రదింపులు జరిపినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇపుడు ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కాగా, 'మైదాన్' చిత్రం ఈ నెల 10వ తేదీన విడుదలకానుంది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments