Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు కలను తీర్చేందుకు పోరాటం.. బాలీవుడ్‌లో మలి ప్రయత్నానికి చరణ్ సిద్ధం..

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (12:03 IST)
టాలీవుడ్‌లో బిగ్ స్టార్స్‌గా వెలిగే వారు బాలీవుడ్‌పై మోజుతో అక్కడకు వెళ్లడం, బంగపాటుకు గురై గోడకు కొట్టిన బంతిలి తిరిగి రావడం సహజమే. అయితే ఆ విధంగా వచ్చిన వారు తిరిగి మళ్లీ అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయరు. అయితే ఆ మధ్య బాలీవుడ్‌కు వెళ్లి సక్సెస్ కొట్టలేక తిరిగి వచ్చిన మెగా హీరో రామ్ చరణ్ మరో సారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బాలీవుడ్ పరిశ్రమలో రెండో ప్రయత్నంలో సూపర్ హిట్ సాధిస్తానని నమ్మకంగా ఉన్నాడు చరణ్. 
 
అసలు మొదటి సినిమా జంజీర్ వంటి మాస్టర్ పీస్ ని రీమేక్ చేయాలనీ అనుకోవడమే పెద్ద తప్పని గతంలోనే అంగీకరించాడు రామ్ చరణ్. ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్లో కచ్చితంగా నటిస్తానని అంటున్నాడు. అంటే ఆ సినిమాని ముట్టుకోవడం తప్పని అన్నాడు కానీ, బాలీవుడ్లో చేయడం తప్పని కాదు కదా….! మొహెంజదారో సినిమా కోసం అశుతోష్ గోవార్కిర్ చరణ్‌ని కాంటాక్ట్ చేశాడట. కానీ ఎందుకనో సెట్ కాలేదట. ఆ తర్వాత ఆ సినిమాలో హీరోగా హృతిక్ రోషన్‌ని తీసుకున్నారట. 
 
కాగా గతంలో చిరంజీవి  కూడా అంతే, బాలీవుడ్‌పై పలుమార్లు దండయాత్రలు చేశారు. ఆ సినిమాలు బాగానే ఆడాయి కాని, చిరంజీవికి మాత్రం అంతగా పేరు రాలేదు. ఈ తరంలో రామ్ చరణ్ తన తండ్రి కలను నిజం చేసి చూపిస్తాడేమో మరి….చూడాలి !

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments