Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి షకీలా కన్నుమూత...?

నటి షకీలా ఇకలేరు. ఈమె బుధవారం రాత్రి కన్నుమూసింది. షకీలా అంటే.. మలయాళ శృంగార నటి కాదండోయ్... బాలీవుడ్ సీనియర్ నటి షకీలా. ఈమె వయసు 82 యేళ్లు. ‘ఆర్‌ పార్‌’, ‘సీఐడీ’ వంటి విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించా

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (18:29 IST)
నటి షకీలా ఇకలేరు. ఈమె బుధవారం రాత్రి కన్నుమూసింది. షకీలా అంటే.. మలయాళ శృంగార నటి కాదండోయ్... బాలీవుడ్ సీనియర్ నటి షకీలా. ఈమె వయసు 82 యేళ్లు. ‘ఆర్‌ పార్‌’, ‘సీఐడీ’ వంటి విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించారు. షకీలా మరణ వార్తను ఆమె బంధువు నాసిర్‌ ఖాన్‌ ఫేస్‌బుక్‌ వేదికగా పంచుకున్నారు. 
 
‘ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. మా పెద్దమ్మ షకీలా కన్నుమూశారు. 1950, 60ల్లో ఆమె ఓ గొప్ప నటిగా, స్టార్‌గా వెలుగొందారు. ‘బాబుజీ ధీరే చల్నా’, ప్యార్‌ మే జరా సంభాల్నా’ అందరికీ గుర్తుండిపోతాయి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించండి. అంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు. 
 
షకీలా ‘శ్రీమాన్‌ సత్యవాది’, ‘చైనా టౌన్‌’, ‘పోస్ట్‌బాక్స్‌ 999’, ‘దస్తాన్‌’, ‘సింధ్‌బాద్‌ ద సెయిలర్‌’, ‘రాజ్‌రాణి దమయంతి’, ‘ఆఘోష్‌’, ‘రాజ్‌మహల్‌’, ‘అలీబాబా ఔర్‌ చాలీస్‌ చోర్‌’, ‘షెహన్‌షా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి, మెప్పించారు. ఆమె చివరిగా 1963లో ‘ఉస్తాదన్‌ కి ఉస్తాద్‌’ చిత్రంలో నటించారు. కాగా ఈమె అంత్యక్రియలు గురువారం పూర్తి చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments