Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ కరోనాతో చనిపోతుంటే ఆ హీరోయిన్ ఆ వ్యాధితో మరణించింది

Webdunia
సోమవారం, 13 జులై 2020 (22:59 IST)
ఇప్పుడు ఎవరు చనిపోయినా కరోనానే అని బాగానే ప్రచారం చేసేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఎవరు చనిపోయినా ఇదే పరిస్థితి. ఇదే రకరమైన ప్రచారం జరుగుతోంది. అయితే సినీనటి, ప్రముఖ మోడల్ దివ్య చౌక్సీ మరణం మాత్రం బాలీవుడ్‌ను తీవ్ర విషాదంలోకి తీసుకెళ్ళిపోయింది. 
 
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువనటి మరణించడంతో సినీ పరిశ్రమ మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. దివ్య చౌక్సీ పలు టెలివిజన్ సీరియల్స్‌లో అద్భుతమైన ప్రతిభను చాటింది. అలాగే హిందీ ప్రేక్షకులందరికీ సుపరిచితురాలు. నటిగానే కాకుండా పలు వ్యాపార ప్రకటనల్లో నటించింది. 
 
హై అప్పా దిల్‌తో ఆవారా అనే చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే 2018 సంవత్సరంలో పాటియాలే ది క్వీన్ అంటూ సింగర్‌గా మారారు. లండన్‌లో యాక్టింగ్ నేర్చుకున్న దివ్య గత కొన్ని నెలలుగా అనారోగ్యానికి గురయ్యారు.
 
అనారోగ్యంగా ఉన్నట్లు తానే స్వయంగా ఒక ట్వీట్ కూడా చేశారు. నేను ప్రస్తుతం బెడ్ మీద ఉన్నాను. క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. తిరిగిమీ దగ్గరకు వస్తానన్న నమ్మకం కూడా నాకు తగ్గుతోంది. కానీ మీ అభిమానం నన్ను బతికిస్తుందని నమ్ముతానని సందేశం పంపింది. కానీ చివరకు చికిత్స పొందుతూ తిరిగి రాని లోకాలకు ఆమె వెళ్లిపోయింది. దివ్య మరణంపై పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments