Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి చేయాలనుకున్నపుడు ఎదురుదెబ్బలు సహజం : సోనుసూద్

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (15:27 IST)
సాధారణంగా మంచి చేయాలన్నపుడు ఎదురు దెబ్బలు తగలడం సహజమని బాలీవుడ్ నటుడు సోనుసూద్ అన్నారు. కరోనా కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకుని రియల్ హీరోగా కనిపించారు. అలాంటి సోనుసూద్ నివాసాలు, ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. 
 
ఈ ఐటీ సోదాలపై సోనుసూద్ స్పందించారు. 'మనం ఏదైనా మంచి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది' నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ మాట వింటున్నాను. అలాంటి సమస్యలు ఎదుర్కొన్నవాడిలో నేనే మొదటివాడినని అనుకోవడం లేదు. ఐటీ అధికారులు మా ఇంటికి రాగానే.. సమాచారాన్ని అడిగి తెలుసుకుని దాడులు సక్రమంగా జరిగేందుకు వాళ్లకు అన్ని రకాలుగా సహకరిస్తానని చెప్పాను. 
 
ఐటీ దాడులు జరగడానికి ముఖ్యమైన కారణమేమిటనేది నాకు కూడా సరిగ్గా తెలీదు. కొంతమంది దీనిని రాజకీయ కోణంలో చూస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ని కలవడం వల్లే ఈ దాడులు జరిగాయంటూ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. 
 
అయితే, అది రాజకీరపరమైన మీటింగ్‌ కాదని కేజ్రీవాల్‌తో భేటీ ముగిసినప్పుడే చెప్పాను. చిన్నారులందరూ చదువుకొనేలా చూడటమే నా ప్రధాన లక్ష్యమని చెప్పాను కూడా. ఇక, ఈ దాడుల నా అభిమానులు కొంతమేర ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్లు నన్ను తమ కుటుంబసభ్యుడిలా భావించారు’ అని సోనూసూద్‌ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Delhi murder: బాల్కనీలో ప్రేమికుల గొడవ.. ప్రియురాలిని ఐదో అంతస్థు నుంచి తోసేశాడు..

ప్రియురాలి కోరిక మేరకు ఆమె భర్తను హత్య చేసిన ప్రియుడు...

గోడపై విద్యార్థిని ఫోటో చూస్తూ హస్తప్రయోగం చేసిన ఇంజినీరింగ్ విద్యార్థి, జైలు శిక్ష

3 వేల కార్లతో సముద్రంలో మునిగిపోయిన కార్గో నౌక!!

Man fights off leopard: చిరుతతో పోరాడి గెలిచిన వ్యక్తి.. ఇటుకలు పులిపై విసిరేశారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments