Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెవ్వు కేక: బోల్డ్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ కేబ‌రే డాన్స‌ర్‌గా మారింది

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (17:26 IST)
Payal Rajput
పాయ‌ల్ రాజ్ పుత్ అంటేనే బోల్డ్ పాత్ర‌ల‌కు ప్ర‌త్యేకం. ఆమె చేసిన సినిమాలు అలాంటివే. ఆర్ఎక్స్ 100 చిత్రంలో ఆమె చేసిన లిప్‌కిస్‌లు తెలిసిందే. కొద్ది సినిమాల్లో న‌టించినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఓటీటీ ఫ్లాట్ ఆమె టాలెంట్‌ను బాగా ఉప‌యోగించుకుని. అనుకోని అతిథి సినిమాలో ఆమె త‌న‌లోని కోరిక‌ల గురించి త‌ల్లితో కూడా బోల్డ్‌గా చెప్పే సీన్‌లు ఆమె ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం. ఇంటికి అతిథి వ‌స్తే అత‌న్ని కోరుకుంటే అత‌ను తిర‌స్క‌రిస్తాడు. ఆఖ‌రికి అత‌న్ని చంపేస్తుంది. ఇలాంటి పాత్ర‌ల్లో పోషించిన ఆమె తాజాగా 3రోజెస్‌లోనూ త‌న ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచింది. 

 
భార‌త వివాహ వ్య‌వ‌స్థ మారాలంటూ అందులో లెక్చ‌ర్ ఇస్తుంది. త‌మ‌కూ కోరిక‌లు ఆశ‌లు వుంటాయ‌నే నేప‌థ్యంలో ఆ సినిమా వుంటుంది. ఇక ఇదిలా వుండ‌గా, అంత‌కుమించి అన్న‌ట్లుగా పాయ‌ల్ రాజ్ పుత్ మ‌రో అడుగు ముందుకు వేసింది. క‌న్న‌డ‌లో ఓ సినిమాలో క్యాబరే డాన్సర్ గా కనిపించబోతున్నద‌ని తెలుస్తోంది.


హీరో ధనుంజయ ఓ సంద‌ర్భంలో బార్‌కు వ‌స్తే అక్క‌డ ఆమె చేసిన డాన్స్ చూసి మ‌తిపోతుంద‌ట‌. ఆ త‌ర్వాత ఏమ‌వుతుంద‌నేది సినిమా చూడాల్సిందే. ఈ సీన్‌కు సంబంధించిన షూట్ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌ద‌ని క‌న్న‌డ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. ఇక‌ముందుముందు ఓటీటీలో మ‌రిన్ని బోల్డ్ కేరెక్ట‌ర్లుకూడా ఆమె చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు వెంట రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

ఆకలిగా వుందని టిఫిన్ సెంటరుకు వెళ్తుంటే అత్యాచారం చేసిన కామాంధులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments