Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగువ నుంచి బాబీ డియోల్ ఉధిరన్ క్యారెక్టర్ లుక్ ఇదే

డీవీ
శనివారం, 27 జనవరి 2024 (15:36 IST)
Bobby Deol look
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఉధిరన్ అనే పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ బాబీ డియోల్. ఇవాళ బాబీ డియోల్ బర్త్ డే సందర్భంగా 'కంగువ' సినిమా నుంచి ఆయన క్యారెక్టర్ ఉధిరన్ లుక్ రిలీజ్ చేశారు.
 
'రూత్ లెస్, పవర్ ఫుల్, అన్ ఫర్ గెటబుల్ ..' అంటూ ఉధిరన్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ బాబీ డియోల్ కు బర్త్ డే విశెస్ చెప్పారు మేకర్స్. ఈ పోస్టర్ లో బాబీ డియోల్ ఉధిరన్ గా యూనిక్ మేకోవర్ లో కనిపిస్తున్నారు. యుద్ధానికి సిద్ధమవుతున్న ఉధిరన్ కు ఆయన వర్గం ప్రజలంతా తమ మద్ధతు తెలుపుతున్నట్లు ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. విజువల్ వండర్ గా ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు 'కంగువ' త్వరలోనే థియేటర్స్ లోకి రాబోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments