Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్ డే-47 అప్‌డేట్స్: ఇంటి సభ్యుల్లో చలనం.. శ్రీహాన్ బర్త్ డే.. ఇనయానే అంతా?

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2022 (23:23 IST)
BB6
బిగ్‌బాస్ డే-47 రసవత్తరంగా సాగింది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూడటంతో పాటు ఆటల్లో అందరూ చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ ఎపిసోడ్ ప్రారంభం అవుతూనే కుక్కలు మొరిగాయి. 
 
బిగ్ బాస్ క్లాసు తీసుకున్నాక ఇంటి సభ్యుల్లో చలనం వచ్చింది. దీంతో అందరూ ప్రమాణాలు చేసి తమ ఆటతీరు గురించి చెప్పారు. బిగ్ బాస్ వారి ప్రమాణాలను నమ్మినట్టు చెప్పారు బిగ్ బాస్. ఈరోజు ఆట పూర్తయ్యేసరికి ఒకరు నామినేట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పారు. 
 
ఇంట్లో బద్దకం బ్యాచ్ గీతూ బాత్రూమ్ క్లీన్ చేయమని రేవంత్‌తో గొడవ పడింది. అలాగే నువ్వెందుకు గిన్నెలు తోమవు అని గీతూని ప్రశ్నించాడు. ఆదిరెడ్డి బాత్రూమ్ క్లీన్ చేసి వచ్చాక గీతూ వెళ్లింది. వెళ్తూ వెళ్తూ ‘నేను నీ అంత మంచిదాన్ని కాదు ఆదిరెడ్డి’ అని చెప్పింది గీతూ.
 
శ్రీహాన్ బర్త్ డే సందర్భంగా ఇంట్లోని సభ్యులు కేకు చేశారు. ముఖ్యంగా ఇనయా ముందుండి అన్నీ చేసింది. దీంతో వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ కావాలంటే ఇంటి సభ్యులు జోక్ చేశారు. 
 
బిగ్‌బాస్ ఇంట్లో ఉండేందుకు అర్హత సాధించేందుకు టాస్క్ పెడుతున్నట్టు చెప్పారు. ఈ టాస్కులో రెండు టీములుగా విడదీశారు. ఒకటి బ్లూటీమ్, రెండోటి రెడ్ టీమ్. బ్లూటీమ్‌కు శ్రీసత్య, రెడ్ టీమ్‌కు ఇనయా నాయకత్వం వహిస్తారని చెప్పారు. 
 
సమయానుసారం వచ్చే బొమ్మలు, పువ్వులను తీసుకుని వచ్చి వాటికి కేటాయించిన స్థలాల్లో పెట్టాలని చెప్పారు. ఈ ఆట మొదట్నించి అరుపులు, గోలలతో నిండిపోయింది. 
 
ఇకపోతే.. ఆటలో చాలా చురుగ్గా ఉన్నాడు రేవంత్. అతనితో అర్జున్, రోహిత్, మెరీనా, శ్రీసత్య, సూర్య గొడవపడుతూనే కనిపించారు. కానీ ఈ ఆటలో ఫైమా, రేవంత్ చాలా బాగా ఆడారు. అలాగే ఈ వారం నామినేషన్లలో సూర్య, గీతూ తప్ప అందరూ ఉన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments