Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్‌ తెలుగు 6 సీజన్: రెండో వారం రచ్చ.. రచ్చ..

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (10:21 IST)
బిగ్‌బాస్‌ తెలుగు 6 రియాలిటీ షోలో మొదటి వారం కంటే రెండో వారం రచ్చ భారీగా కనిపించింది. కంటెస్టెంట్ల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. తొలివారం ఫన్ డే తర్వాత ఇంటి సభ్యుల్లో భారీగా వాదనలు కనిపించాయి. అయితే ప్రధానంగా సింగర్ రేవంత్ వ్యవహరశైలిపై కంటెస్టెంట్లు భారీగా ఆరోపణలు చేశారు. అరోహి, సూర్య మధ్య జరిగిన గొడవ ఆసక్తికరంగా కనిపించింది. 
 
అయితే బిగ్‌బాస్ ఇంటిలోకి వచ్చిన తర్వాత సూర్యను ఉద్దేశించి నీవు కేవలం కంటెస్టెంట్ మాత్రమే అని అరోహి అనడం గొడవకు దారి తీసింది. మన మధ్య కేవలం కంటెస్టెంట్ రిలేషన్ మాత్రమే ఉందా అంటూ సూర్య నిలదీశాడు.
 
అరోహిరావుతో సూర్య మాట్లాడుతూ.. నన్నేమన్నావు అంటూ ప్రశ్నించాడు. బిగ్‌బాస్‌లోకి టైటిల్ గెలువాలనే పర్పస్‌తో వచ్చాం. మనం ఇంటిలో ప్లేయర్స్ మాత్రమే అని అరోహి చెప్పింది.
 
దాంతో అంతేగా.. ఆల్ ది బెస్ట్. నేను ఏదైనా కంప్లయింట్ ఇవ్వాలంటే.. నీతోనే స్టార్ట్ చేయగలను అంటూ సూర్య వెటకారంగా బిహేవ్ చేశాడు. అయితే నీవు నాకు ఇలాంటి సోది చెప్పకు అంటూ అరోహిరావు గట్టిగా సమాధానం ఇచ్చింది.
 
బిగ్‌బాస్ ఇంటిలో విషయాలను పక్కన పెడితే.. మనకు పర్సనల్ రిలేషన్ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకో అని అరోహి అంటే.. అదే విషయాన్ని నీవు గుర్తుపెట్టుకో అంటూ సూర్య దబాయించినట్టు మాట్లాడాడు. 
 
ఫస్ట్ నీవు మొదలుపెట్టావా? నేను మొదలుపెట్టావా అంటూ అక్కడి నుంచి వెళ్తూ.. ఇక నుంచి నన్ను పిలువకు అని అరోహిగా కోపంగా అరిచింది. దాంతో గుర్తు పెట్టుకో అని సూర్య దబాయించాడు. దాంతో దవడ పగిలిపోతుంది అంటూ అరోహి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడికి వచ్చాక మనం కంటెస్టెంట్లం అని చెప్పింది. 
 
అయితే అరోహి, సూర్య గొడవ పడుతుంటే.. కీర్తి వచ్చి సముదాయించే ప్రయత్నం చేసింది. మీరిద్దరు గొడవ పెట్టుకొని అందరి ముందు చిల్లర కాకండి అంటూ చెప్పింది. 
 
ఒక్కసారి కలిసి ఉంటారు. వెంటనే గొడవ పెట్టుకొంటారు. ఫ్రెండ్ షిప్ అంటే ఇలాంటి ఉంటాయా? మనం ఎక్కడ ఉంటున్నావో తెలుసా? అని కీర్తి అన్నది. దాంతో నా కోపమే అందరికి కనిపిస్తుందా? అని అరిచింది. 
 
దాంతో సూర్య కొంచెం తగ్గించుకొని అరోహిరావును బుజ్జగించాడు. నాకు కోపం ఎక్కువ. ఇక్కడ కూర్చో అని సూర్య అన్నాడు. నీవు బయటకు వెళ్లిన తర్వాత నీ సంగతి చూస్తా అని అరోహి బెదిరించింది. ఆ తర్వాత నాకు మరోసారి సారీ చెప్పు అంటూ సూర్యను అరోహి అడిగింది. అలా వారిద్దరి మధ్య గొడవకు పుల్ స్టాప్ పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments