Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావ్? పునర్నవిని అడిగిన రాహుల్.. రాఖీ కట్టబోయిన..?

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (12:34 IST)
బిగ్ బాస్ మూడో సీజన్‌లో భాగంగా.. మొన్నటికి మొన్న బిగ్ బాస్ అన్ సీన్ వీడియోలను లీక్ చేసింది. ఈ వీడియోలో పునర్నవిని రాహుల్ ఓ ప్రశ్న అడిగాడు. బిగ్ బాస్‌ను వదిలి బయటికి వెళ్లాక.. పునర్నవీ నీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావ్? అని అడిగాడు. 
 
అందుకు పని చూసుకో అంటానని చెప్తుంది. అందుకు ఊరకే చెప్పు. అప్పుడప్పుడు ఇలాంటి పిచ్చిప్రశ్నలు వేస్తుంటాను. సీరియస్‌గా తీసుకోకు అన్నాడు. అందుకు పునర్నవి పిచ్చి ప్రశ్నలేంటి బాబోయ్ అంటూ తప్పుకుంది. దీంతో పునర్నవిపై రాహుల్ లవ్ ట్రాక్ నడుపుతున్నాడని నెట్టింట చర్చ మొదలైంది.
 
అయితే బిగ్ బాస్ సీజన్ 3లో నాలుగో వారం శుక్రవారం ఎపిసోడ్‌లో రక్షాబంధన్ సంబరాలు జరిగాయి. ఇందులో భాగంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అన్నాచెల్లెల్లుగా తమ మధ్య ప్రేమను చాటారు. వరుణ్ సందేశ్ కి హిమజ. రవికి రోహిణి రాఖీ కట్టగా, మహేష్‌కి అషు, అలీకి శివజ్యోతి రాఖీ కట్టి ఎమోషనల్ అయ్యారు.
 
అయితే పునర్నవి ఎవరికి రాఖీ కడుతుందనగా.. అతనిలో మా తమ్ముడ్ని చూస్తున్నా అంటూ పునర్నవి రాహుల్ వైపు చూడటంతో.. రాహుల్ ఒక్కసారిగా టెన్షన్ పడ్డాడు. కానీ ఇంతలో వరుణ్ సందేశ్‌ని ఉద్దేశిస్తూ ఆ మాట అన్నట్లు పునర్నవి చెప్పడంతో రాహుల్ కూల్ అయ్యాడు. దీంతో హౌస్‌లో వారంతా నవ్వేశారు.
 
పునర్నవి.. వరుణ్‌కి రాఖీ కట్టి తమ్ముడు అని పిలిచింది. హౌస్‌లో ఉన్నవారందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఒక్క రాహుల్ కి తప్ప అంటూ అతడిని టీజ్ చేసింది పునర్నవి. ఆమె మాటలు విన్న మిగిలిన కంటెస్టంట్స్ అరుస్తూ రాహుల్‌ని ఏడిపించారు. 
 
రక్షాబంధన్ వేడుకలు పూర్తయిన తరువాత బాబా భాస్కర్ కోసం స్పెషల్ మెసేజ్ అంటూ బిగ్ బాస్ ఓ వీడియో ప్లే చేశారు. అందులో బాబా భార్య మాట్లాడుతూ కనిపించింది. తన భర్తకు జాగ్రత్తలు చెప్పడంతో పాటు గేమ్‌ని గేమ్‌లా ఆడాలని సలహా ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

UP Horror: 52 ఏళ్ల వ్యక్తిని చంపేసిన బావమరిది, అత్త హత్య చేశారు..

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments