Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BBTeluguGrandFinale: గ్రాండ్ ఫినాలే విజేతగా వీజే సన్నీ

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (22:29 IST)
బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ఆదివారం రాత్రి జరిగింది. ఈ గ్రాండ్ ఫినాలే విజేతగా వీజే సన్నీ నిలిచారు. దీంతో ఆయనకు రూ.50 లక్షల నగదు బహుమతి అందజేయగా, షణ్ముఖ్‌కు రూ.25 లక్షల నగదు పురస్కారం ఇచ్చారు. మొత్తం 15 వారాల 100 రోజుల పాటు అనేక మలుపులు, పలు భావోద్వేగాలు, ఏడుపులు, నవ్వులు అనేకానేక విధాలుగా ఈ ఐదో సీజన్‌ను హోస్ట్ అక్కినేని నాగార్జున విజయవంతంగా పూర్తిచేశారు. 
 
అంతకుముందు.. ఈ గ్రాండ్ ఫినాలే కోసం ఐదుగురు ఎంపికయ్యారు. వీరిలో తొలుత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సిరి. ఫైనల్ వారానికి ఐదుగురు అర్హత సాధించగా, వారిలో సిరి ఒకరు. అయితే, హౌస్‌లోకి వెళ్లిన హీరోయిన్ రష్మిక మందన్నా.. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సిరి ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఆమెను స్టేజీపైకి తీసుకొచ్చారు. 
 
ఈ సందర్భంగా సిరి మాట్లాడుతూ, బిగ్ బాగ్ ఇంట్లో తన ప్రస్థానం అద్భుతంగా సాగిందన్నారు. తాను ఎలా ఉండాలనుకున్నానో అలానే ఉన్నానని తెలిపింది. సిరి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో మానస, సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముక్ ముగిలిపారు. ఆ తర్వాత మానస్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. 
 
ఆ తర్వాత కంటెస్టెంట్లకు డబ్బు ఆఫర్ చేసేందుకు 'శ్యామ్ సింగారాయ్' టీమ్ నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ సాయిపల్లవి, కృతిశెట్టిలు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. కానీ డబ్బు కోసం హౌస్‌లో మిగిలిన నలుగురు ఏమాత్రం ఆసక్తి చూచడం లేదు. దీంతో చివరగా నలుగురు బొమ్మలు వేలాడదీశారు. 
 
లీవర్ లాగినపుడు ఎవరి బొమ్మ కిందపడిపోతుందో వారు ఎలిమినేట్ అవుతారని హోస్ట్ నాగార్జున ముందుగానే ప్రకటించారు. ఇందులో మానస్ బొమ్మ కిందపడిపోవడంతో అతడు ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్‌లో మిగిలింది శ్రీరామ్, షణ్ముఖ్, వీజే సన్నీలు ఉన్నారు. ఈ ముగ్గురులో ఒకరి విజేతగా నిలువనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KCR Is The Trump of Telangana: ఒకప్పుడు కేసీఆర్ తెలంగాణకు ట్రంప్‌లా వుండేవాడు..

Uppada: ఉప్పాడ భూమిని మింగేసిన సముద్రం- పవన్ కల్యాణ్ ఒత్తిడి వల్లే?

డిసెంబరు నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి : సీఎం చంద్రబాబు

అసెంబ్లీ సమావేశాలు : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమకు డిప్యూటీ సీఎం పవన్ ఘాటు కౌంటర్

నగరం లోపల నగరంగా ఆవిర్భవిస్తున్న హైదరాబాద్ యొక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

తర్వాతి కథనం
Show comments