Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్ 4... గంగవ్వను నామినేట్ చేసిన హౌస్ మేట్స్.. రచ్చ రచ్చ

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (18:26 IST)
Bigg Boss 4
బిగ్ బాస్ సీజన్ 4 హడావిడి మొదలైంది. తొలి రోజే గొడవలు, ఏడుపులతో ప్రారంభం అయింది. ఇక మొదటి వారం ఎలిమినేషన్ ఉండదని అందరూ అనుకున్నారు కానీ, నామినేషన్ ప్రక్రియ మొదటి రోజే పూర్తి చేశాడు బిగ్ బాస్.

14 మంది సభ్యులను ఇద్దరేసిగా కనెక్ట్ చేసి వారిలో ఒక్కోరిని నామినేట్ చేయమన్నాడు బిగ్ బాస్. అంటే ఏడుగురు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారన్న మాట. ఈ నామినేషన్ ప్రక్రియలో కల్యాణి.. సుజాతల మధ్య మాత్రం గట్టి ఫైట్ అయింది.
 
ఇక అంతా కలిసి గంగవ్వను టార్గెట్ చేశారు. గంగవ్వమీద ప్రేమ ఒలకబోస్తూనే ఆమెను నామినేట్ చేసారు. వీరిలో దేత్తడి హారిక తప్ప మిగిలిన వారందరు గంగవ్వను నామినేట్ చేసారు. గంగవ్వను నామినేట్ చేసి దానికి కారణం కూడా చెప్పుకొచ్చారు. బయట గంగవ్వ బయట నీకు మంచి ఫాలోయింగ్ ఉంది.

మేము నిన్ను నామినేట్ చేసిన బయట జనాలు నిన్ను బయటకు వెళ్లనివ్వరు అంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా మొదటి వారమే గంగవ్వను డేంజర్ జోన్‌లోకి నెట్టేశారు.
 
ఇక మొదటి రోజే ఇంటీసభ్యులంతా ఏడుపులు, గొడవలు, గ్లామర్ షోలతో రచ్చ రచ్చ చేశారు. సీక్రెట్ రూమ్‌లో ఉన్న ఇద్దరూ ఆరియానా గ్లోరీ, సోహిల్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి తొలి రోజు నుంచే బయట గంగవ్వకు ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. మరి గంగవ్వ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి..
 
బిగ్ బాస్ సీజన్ 4 ఆదివారం (సెప్టెంబర్ 6న) ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పుడే బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ మొదలైంది. కరాటే కళ్యాణి, జోర్దార్ సుజాతలు రెండో రోజు గొడవపడ్డారు. అప్పుడే ఓదార్చడాలు సైతం మొదలయ్యాయి. తొలిరోజు ఎలాగూ హౌస్‌లో కాలుపెట్టిన రోజు కాగా, రెండో రోజే బిగ్ బాస్ 4 తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది.
 
తొలి వారం నామినేట్ అయ్యింది వీరే...
అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్ధక్, దివి, మెహబూబ్, సుజాత, గంగవ్వ
 
తొలి వారం సేవ్ అయ్యింది వీరే...
దేత్తడి హారిక, దేవి నాగవల్లి, కరాటే కళ్యాణి, అమ్మ రాజశేఖర్, యాంకర్ లాస్య, మొనాల్ గజ్జర్, నోయల్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments