Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ హౌస్ నుంచి నోయల్ అవుట్.. ఐ లవ్ యూ అంటూ ఏడ్చేసిన..?

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (10:10 IST)
ర్యాప్ సింగర్ నోయల్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. ఇప్పటికే అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ నుండి గంగవ్వ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్ధరైటిస్‌తో బాధపడుతున్న నోయల్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. మొదటల్లో బాగానే ఉన్నా రాను రాను అతని ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. నడవలేని పరిస్థితిలో ఉండడంతో బీబీ డే కేర్ టాస్క్ నుండి అతనికి విశ్రాంతినిచ్చారు బిగ్ బాస్‌.
 
నోయల్ ఆరోగ్యంకి సంబంధించి పలు పరీక్షలు చేసిన డాక్టర్ అతనికి మంచి వైద్యం అందించేందుకు బయటకు పంపాలని చెప్పారు. దీంతో బిగ్ బాస్‌.. నోయల్‌ను హౌజ్ నుండి బయటకు వచ్చేయాలన్నారు. ఇదే విషయాన్ని నోయల్ ఇంటి సభ్యులతో షేర్ చేయగా, వారందరు కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా హారిక అతనిని పట్టుకొని ఎమోషనల్ అయింది. అభిజిత్‌, సోహైల్‌లు అతనికి ధైర్యాన్ని అందించారు.
 
హౌజ్‌ను భారంగా వీడుతున్న సమయంలో నోయల్‌.. మీరు త్వరగా కోలుకొని బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెడతారని ఆశిస్తున్నామనడంతో హారికతో పాటు మిగతా ఇంటి సభ్యులు మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అని ధైర్యం అందించారు. అయితే హారిక మాత్రం నోయల్ వెళ్లిపోయినా ఆ డోర్ దగ్గరే ఉండిపోయి.. ఐ లవ్ యూ అంటూ అరుస్తూ తెగ ఏడ్చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments