Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో లైవ్‌లోకి పునర్నవి.. లైట్‌గా తీసుకో రాహులా.. జోకులేసిన పున్ను!

Webdunia
సోమవారం, 7 అక్టోబరు 2019 (18:04 IST)
టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం మళ్లీ రియల్ లైఫ్‌లోకి వచ్చేసింది. బిగ్ బాస్ మూడో సీజన్‌లో 11 వారాల పాటు కొనసాగింది. చివరికి ఆదివారం ఎలిమినేట్ అయ్యింది. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో ఆమె స్నేహం అనేక ఊహాగానాలకు తావిచ్చినా, ఎన్ని ప్రశ్నలు ఎదురైనా హుందాగా వ్యవహరించిన ఆమె తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక, చాలారోజుల తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చిన పునర్నవి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది.
 
"మళ్లీ మన లోకంలోకి వచ్చేశాను. బిగ్ బాస్ ఇంట్లో ఇదో అద్భుత ప్రయాణం. ప్రతిక్షణం ఆస్వాదించాలన్నదే నా అభిమతం. నా ప్రియమైన ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు. మీరు లేకుండా నేను లేను. ఆదరించిన అందరికీ ధన్యవాదాలు. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. త్వరలోనే కోలుకుని అన్ని విషయాలతో లైవ్‌లోకి వస్తా" అంటూ తన పోస్టులో పేర్కొంది.
 
ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో పునర్నవి ఎలిమినేట్ కావడంతో రాహుల్ దు:ఖ సాగరంలో మునిగిపోయాడు. వీడేండ్రా బాబూ.. మరీ ఇలా ఏడుస్తున్నాడు.. మరీ ఇంత డీప్‌గా పునర్నవిని నాగార్జున చెప్పినట్టుగానే లవ్ చేశాడా? అనే అనుమానాలు కలిగించాడు.
 
అయితే పునర్నవి మాత్రం హౌస్‌లో ఉన్నంత సేపు రాహుల్‌తో లవ్ ట్రాప్ నడిపినట్టుగానే వ్యవహరించి బిగ్ బాస్ స్టేజ్ మీదికి రాగానే.. ఏడ్చాడులే అన్నట్టుగానే ఉంది. పాపం రాహుల్ వెక్కి వెక్కి ఏడుస్తుంటే పిచ్చోడు మాదిరి ఉన్నాడే లైట్ తీస్కో రాహులా అన్నట్టుగా జోకులు వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments