Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ హౌస్‌లోకి నాని.. పూజ ఎలిమినేషన్.. స్వీట్లు, పాయసాన్ని వడ్డించిన?

తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. గతవారం ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చిన వారిలో కౌశల్, తనీశ్, దీప్తి ప్రొటెక్టెడ్ జోన్‌లోకి వెళ్లిపోగా నటి పూజా రామచంద్రన్ ఈ వారం ఎలిమినేట్ అయ్యింది. పూజ

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (10:58 IST)
తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. గతవారం ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చిన వారిలో కౌశల్, తనీశ్, దీప్తి ప్రొటెక్టెడ్ జోన్‌లోకి వెళ్లిపోగా నటి పూజా రామచంద్రన్ ఈ వారం ఎలిమినేట్ అయ్యింది. పూజ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించగానే హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాకయ్యారు.


ఎలిమినేషన్ సందర్భంగా పూజ మాట్లాడుతూ.. ఎలిమినేట్ కావడంపై బాధగా లేదని చెప్పింది. గేమ్‌ను గేమ్‌గానే చూడాలని.. బిగ్ బాస్ హౌస్‌లో తాను బాగా ఎంజాయ్ చేశానని తెలిపింది. గేమ్ సభ్యులతో ఆటలు తనకెంతో నచ్చాయని వెల్లడించింది. 
 
మరోవైపు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఓ స్పెషల్ గెస్ట్ వచ్చాడు. అతడు మరెవరో కాదు.. హోస్ట్ నాని. అతడిని చూసిన వెంటనే హౌస్ సభ్యులు ఒక్కసారిగా ఆనందంతో ఎగిరి గంతేశారు.

నాని వస్తూ వస్తూ తనతోపాటు స్వీట్లు, పోటీదారుల కుటుంబ సభ్యులు పంపించిన రాఖీలు, లెటర్లు మోసుకొచ్చాడు. దీంతో హౌస్‌‌లో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. సామ్రాట్, కౌశల్, తనీశ్ తదితరులకు ఇంటి నుంచి వచ్చిన రాఖీలను దీప్తి, గీతామాధురి తదితరులు కట్టారు. కాగా, తాను తీసుకొచ్చిన స్వీట్లు, పాయసాన్ని నాని స్వయంగా వడ్డించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments