Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిగ్ బాస్‌' ద్వారా ఇచ్చే సందేశం ఏంటి? ఒక కంటెస్టెంట్‌కు కరోనా పాజిటివ్!! (video)

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (21:44 IST)
ఎంతగానో బుల్లితెర ప్రేక్షకాధారణ పొందిన బిగ్ బాస్ రియాల్టీ షో నాలుగో సీజన్ త్వరలో ప్రారంభంకానుంది. ఇప్పటికే మూడు సీజన్‌లు విజయవంతంగా పూర్తికాగా, ఇపుడు నాలుగో సీజన్‌ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ షోకు ప్రధాన హోస్ట్‌గా సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వ్యవహరించనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ రియల్టీ షోను ఆపాలంటూ కొందరు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్-4ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ మహిళ హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖ ముక్తల, తల్లిదండ్రుల సంఘం నేత గడ్డం మురళి, తెలంగాణ విద్యార్థి జేఏసీ నేత అమన్ గల్ రాజు ఫిర్యాదు చేశారు. ఈ షో ద్వారా సభ్య సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ ఫిర్యాదుదారులు ప్రశ్నిస్తున్నారు. 
 
కాగా, బిగ్ బాస్ షోపై ఫిర్యాదులు ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనేక పర్యాయాలు ఫిర్యాదులు వచ్చినా, బిగ్ బాస్ షోకు మాత్రం ఎలాంటి అడ్డంకి ఏర్పడలేదు. మరి ఈసారి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి! కాగా, ఆగస్టు 30న బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రసారం అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 
 
బిగ్ బాస్‌ కంటెస్టెంట్‌కు కరోనా పాజిటివ్ 
ఇదిలావుండగా, వచ్చే ఆదివారం ఆగస్టు 30వ తేదీ నుంచి బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ షోలో పాల్గొనున్న కంటెస్టెంట్‌లలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు సమాచారం. దీంతో ఆ కంటెస్టెంట్‌ను హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. 
 
మొత్తం 16 కంటెస్టెంట్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఒక్కరికి మినహా మిగిలినవారందరికీ నెగెటివ్ ఫలితం వచ్చింది. ఈ కరోనా వైరస్ బారినపడిన కంటెస్టెంట్ కూడా యువ గాయకుడని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ యువ గాయకుడు కూడా త్వరలోనే కరోనా వైరస్ నుంచి కోలుకుని తిరిగి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశిస్తాడని నిర్వాహకులు గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఎస్ఐ (Video)

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments