Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్ హాసన్ 'బిగ్‌బాస్' ఫైనలిస్ట్‌లో తెలుగు హీరోయిన్‌

హీరో కమల్ హాసన్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న తమిళ బిగ్‌బాస్ రియాల్టీ షో చివరి దశకు చేరుకుంది. అయితే, తెలుగు రియాల్టీ షోతో పోల్చుకుంటే తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగులో కేవలం 70 రోజులకే పరిమితమైన బ

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (06:49 IST)
హీరో కమల్ హాసన్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న తమిళ బిగ్‌బాస్ రియాల్టీ షో చివరి దశకు చేరుకుంది. అయితే, తెలుగు రియాల్టీ షోతో పోల్చుకుంటే తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగులో కేవలం 70 రోజులకే పరిమితమైన బిగ్‌బాస్... తమిళంలో మాత్రం 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది.
 
అంటే.. అందులోని హౌస్‌మేట్స్ తెలుగు సెలబ్రిటీల కంటే ఎక్కువ రోజులే బిగ్‌బాస్ ఇంట్లో గడిపేశారన్న మాట. మొత్తం 15 మంది హౌస్‌మేట్స్‌లో ఇప్పుడు ఐదుగురు మాత్రమే ఫైనల్స్‌కు చేరారు. రానున్న ఆదివారం తెలుగు బిగ్‌బాస్‌తోపాటే.. తమిళ బిగ్‌బాస్ కూడా ముగియనుంది. 
 
అయితే, తమిళ బిగ్‌బాస్ షోకు చేరుకున్న తుది ఐదుగురిలో తెలుగమ్మాయి కూడా ఉంది. ఆమె మరెవ్వరో కాదు.. మన 'అవకాయ్ బిర్యానీ' ఫేం బిందు మాధవి. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెకు చెందిన బిందుకు.. తెలుగులో పెద్దగా అవకాశాలు లభించలేదు. అయితే, తమిళంలో మాత్రం మంచి ఛాన్స్‌లతో స్థిరపడింది. 
 
ఈ నేపథ్యంలో 'బిగ్‌బాస్' ఆమెకు 'బంపర్ ఆఫర్' ఇచ్చాడు. బిగ్‌స్కీన్‌పై తమిళ ప్రేక్షకుల మనసులు దోచుకున్న బిందు.. బుల్లితెర బిగ్‌బాస్‌ విజేత కావాలంటే ఆమెకు ఓట్ల శాతం పెరగాల్సిందే. ఎందుకంటే.. ఆమెతో పాటు ఉన్న మిగతా నలుగురు సభ్యులైన ఆరవ్, గణేష్ వెంకట్రామ్, హరీష్ కళ్యాణ్, సుజా వరుణీకి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో బిందు మాధవి విజేతగా నిలుస్తుందో లేదోనన్న టెన్షన్ నెలకొనివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments