Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్‌తో బిగ్ బాస్ ఓవియా పోటాపోటీ.. అబ్బా.. అన్ని రీ ట్వీట్లా?

తమిళ బిగ్ బాస్ ద్వారా మాంచి క్రేజ్ సంపాదించిన ఓవియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కో-పార్టిసిపెంట్స్‌తో బిగ్ బాస్ కోసం పోటీపడిన ఓవియా ఇటీవల మానసిక సమస్యల కారణంగా బయటికి వచ్చేసింది. ఈ

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (16:52 IST)
తమిళ బిగ్ బాస్ ద్వారా మాంచి క్రేజ్ సంపాదించిన ఓవియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కో-పార్టిసిపెంట్స్‌తో బిగ్ బాస్ కోసం పోటీపడిన ఓవియా ఇటీవల మానసిక సమస్యల కారణంగా బయటికి వచ్చేసింది. ఈ బిగ్ బాస్ కార్యక్రమం నుంచి ఓవియా బయటకు వచ్చేసినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. బిగ్ బాస్ హౌస్‌లో వుండగానే ఆమె పేరిట ఓవియా ఆర్మీ అంటూ ఫ్యాన్స్ ఓ గ్రూపును క్రియేట్ చేశారు. 
 
ఈ గ్రూపు ద్వారా ఓవియా ట్వీట్స్ రీ ట్వీట్ అవుతాయి. లైక్స్ పెరిగిపోతాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చాక ఓవియా చేసిన తొలి ట్వీట్‌కు 56 వేల‌కు పైగా లైకులొచ్చాయి. ఈ ట్వీట్‌ను 15వేల మందికి పైగా నెటిజ‌న్లు రీట్వీట్ చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ట్వీట్‌కి కూడా ఇన్ని రీట్వీట్ల్ రాలేదు. బిగ్ బాస్‌ తమిళంలో ఆమె ప్రవర్తన ఆమెకు పేరుతో పాటు గుర్తింపును సంపాదించిపెట్టింది. ఈ క్రమంలోనే ఓవియా ఆర్మీ ఓ ట్రెండ్‌గా మారింది.
 
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఓవియా ఆఫర్లు వెల్లువల్లావస్తున్నాయి. ఇటీవల బిగ్‌బాస్‌ ఇంటి నుంచి ఆమె బయటకు వచ్చేయడంతో అభిమానులను తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మళ్లీ బిగ్‌బాస్‌ ఇంటికి ఓవియా వెళ్లే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఓవియా నటుడు విజయ్‌ సరసన నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విజయ్‌ అట్లి దర్శకత్వంలో ‘మెర్సల్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకునే సినిమాలో ఓవియా నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్. ఇందులో విజయ్‌ సరసన ముగ్గురు కథానాయికలు ఆడిపాడనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YS Abhishek Reddy: జగన్ బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

పల్లెకు పోదాం ఛలో ఛలో... సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు

Twist: బిచ్చగాడితో పారిపోయిన వివాహిత.. ఈ కేసులో కొత్త ట్విస్ట్.. ఏంటది?

జగన్మోహన్ రెడ్డి హ్యాపీ.. విదేశాలకు వెళ్లే అనుమతి మంజూరు

ప్రేమించి పెళ్లాడి నిన్నే వేధించినవాడు.. నన్నెలా లాలిస్తాడమ్మా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments