Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్-7: RC16లో అర్జున్ అంబటి

Webdunia
సోమవారం, 13 నవంబరు 2023 (13:37 IST)
Arjun Ambati
కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న వివాదాస్పద రియాల్టీ షో బిగ్ బాస్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కలర్ ఫుల్ హంగామా జరుగుతోంది. ఆదివారం దీపావళి సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో సంబరాలు జరిగాయి. ఈ ప్రత్యేక కార్యక్రమానికి కొందరు అతిథులు కూడా హాజరయ్యారు.
 
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ వచ్చి సందడి చేశారు. శ్రీలీల, కాజల్ అగర్వాల్, బుచ్చిబాబు కూడా హాజరయ్యారు. బిగ్ బాస్ 7లో వైల్డ్ కార్డ్‌గా అడుగుపెట్టిన ఓ కంటెస్టెంట్‌కి బంపర్ ఆఫర్ వచ్చింది. ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయాడు. 
 
ప్ర‌స్తుతం బుచ్చిబాబు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో భారీ పాన్ ఇండియా ఫిల్మ్ ఆర్‌సి 16 చిత్రీకరణకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బిగ్ బాస్ వేదికపైకి అతిథిగా వచ్చిన బుచ్చిబాబు, నాగార్జునలు సరదాగా మాట్లాడుకున్నారు. ఉప్పెన సినిమాకు జాతీయ అవార్డు వచ్చినందుకు బుచ్చిబాబుని నాగ్ అభినందించారు. 
 
ఇంతలో బుచ్చిబాబు ఇంటి నుంచి అర్జున్ అంబటి మాట్లాడుతూ.. మీ కోసం రెండు సార్లు ఆఫీసుకు వచ్చాను. మీరు చెన్నై వెళ్లారని చెప్పారు. ఇంతలో, బుచ్చిబాబు ఇలా బదులిచ్చారు: అర్జున్ అంబటి, మీరు రామ్ చరణ్ చిత్రం RC16లో సూపర్ క్యారెక్టర్‌లో నటించబోతున్నారు. దీంతో అర్జున్ థ్యాంక్యూ అంటూ ఉడాయించాడు. అలా హౌస్‌లో ఉన్న అర్జున్ అంబటికి బంపర్ ఆఫర్ వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ అంతు చూస్తా... ఎమ్మెల్యే కొండబాబుకి ద్వారంపూడి అనుచరుడు భళ్లా సూరి వార్నింగ్ (video)

ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కకు పెట్టిన మెసేజ్ ఆధారంగా గుర్తింపు!! తేజస్వి ఆచూకీ తెలిసిందిలా...

నార తీస్తున్న నాదెండ్ల మనోహర్, పరుగులు పెట్టిస్తున్న పవన్ కల్యాణ్ (video)

సంగారెడ్డిలో బాలుడిపై వీధి కుక్కల స్వైర విహారం.. (Video)

జనసేన జెండాతో ఇంటి ముందు నిల్చొన్న బాలుడు... కారు దిగి షేక్‌హ్యాండ్ ఇచ్చిన పవన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments