Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్-5: 8th సెప్టెంబర్ హైలైట్స్: ఆలూ కూర కోసం కొట్లాట... యానీ మాస్టర్, జెస్సీల వార్..

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (10:11 IST)
BB5
బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 4 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 4వ ఎపిసోడ్ ముగిసే సరికి ఇంటి సభ్యుల మధ్య రచ్చతో ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ ఎవరూ తగ్గడం లేదు. దీంతో మొదటి రోజు నుండే హౌస్‌లో గొడవలు మొదలయ్యాయి. యానీ మాస్టర్, జెస్సీ మధ్య జరిగిన పెద్దదిగా మారడం, యానీ మాస్టర్ కంటతడి పెట్టడం,జెస్సీ యానీ మాస్టర్ కాళ్లు పట్టుకోవడం వరకు వెళ్లింది.
 
ఇక తాజాగా యాంకర్ రవి - మానస్ మధ్య మరో గొడవ జరిగింది. లోబోకు.. ఇతర కంటెస్టెంట్లులా ఇమిటేట్ చేయమని యజమాని అయిన షణ్ముక్ టాస్క్ ఇచ్చాడు. అయితే లోబో అందరిని ఇమిటేట్ చేస్తూ చక్కగా నటించగా శ్రీరామ చంద్ర, మానస్‌లు అక్కడే అటు ఇటూ తిరుగుతూ సైట్ కొడుతున్నట్టుగా చూపించేశారు రవి, విశ్వ. దీంతో రవి తనలా ఇమిటేట్ చేయడంతో హర్ట్ అయ్యాడు మానస్. 
 
ప్రతీ సారి ఆ విషయాన్ని అంత లాగాల్సిన పని లేదు. ఇదేమీ ఆయన హోస్ట్ చేస్తోన్న షో కాదు.. ఈవెంట్ కాదు.. బిగ్ బాస్ ఐదో సీజన్‌కు హోస్ట్ కాదు.. అంతగా ఆ విషయాన్ని లాగాల్సిన అవసరం లేదని మానస్ తన మనసులోని బాధను బయటపెట్టేశాడు. దీంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్న సంగతి తెలిసిందే. సినీ, టీవీ, సోషల్ మీడియా రంగాలకు చెందిన వీరు టైటిల్ టార్గెట్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టారు. హౌజ్‌లో వీరు అడుగుపెట్టి రెండు రోజులు కాగా, వీరి అసలు స్వరూపాలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. అమాయకుడు అనుకున్న జెస్సీ ఆవేశపరుడిగా కనిపిస్తున్నాడు. లోబో తనదైన స్టైల్‌లో తెగ నవ్విస్తున్నాడు.
 
ఇక హమీదాని చూసి మొదట్లో అమాయకురాలని అంచనాకు వచ్చారు. కాని ఆమె రోజురోజుకి తన గడుసు తనం చూపిస్తుంది. లహరితో పదే పదే గొడవలు పడుతుంది. నేనేదైనా అడిగితే ఎందుకు సరిగా సమాధానం ఇవ్వవని లహరి హమీదాను ప్రశ్నించింది. కానీ హమీదా తనను బేఖాతరు చేస్తూ నా ఇష్టం, నేనిలాగే మాట్లాడతానని దురుసుగా వ్యవహరించింది. అయితే ఆ తర్వాత ఇద్దరు కాంప్రమైజ్ అయి ఫ్రెండ్స్‌లా మారారు.
 
ఇక ఆర్జే కాజల్‌ని అందరు టార్గెట్ చేశారు. బిగ్ బాస్ గురించి పూర్తిగా తెలుసుకొని వచ్చిందని హౌజ్‌మేట్స్ భావిస్తున్నారు. మానస్ ప్రత్యేక పవర్ అందుకోగా, ఆ పవర్‌తో అందరూ పడుకున్నాకే కాజల్ నిద్రాంచాలని చెప్పాడు. కాని ఆమెను ఓడించాలని హౌజ్‌మేట్స్ మేల్కోని ఉండడంతో ఇది అర్ధం చేసుకున్నకాజల్ మంచం ఎక్కి పడుకుంది. ఇక శక్తి చూపరా డింభకా టాస్క్‌లో సిరి గెలుపొందగా ఆమె ఇద్దరు ఇంటిసభ్యులను ఎంచుకుంది.
 
షణ్ముఖ్‌ను యజమానిగా, లోబోను సేవకుడిగా ఎంచుకొని సిరి బిగ్ బాస్‌తో పాటు ఇంటి సభ్యులకు చెప్పింది. అయితే తనకు దొరికిన అవకాశాన్ని లోబో చక్కగా ఉపయోగించుకున్నాడు.అందరు హౌజ్‌మేట్స్ మాదిరిగా మిమిక్రీ అద్భుతంగా చేసి చూపించాడు. ఆలూ కూర తనకు వడ్డించకుండా ఫ్రిజ్‌లో పెట్టారని యానీ మాస్టర్‌ మీద మండిపడింది ఉమాదేవి. నేను అడిగినప్పుడు కూర లేదన్నారు, మరి ఇప్పుడెలా ఉందని నిలదీసింది. నేను బిచ్చం అడుక్కోవడానికి రాలేదంటూ ఫైర్‌ అయింది.
 
గత సీజన్‌లో కరాటే కళ్యాణి.. అరియానా గ్లోరిల మధ్య ఇలాంటి గొడవే జరిగింది. తనకు ఆలూ కూర పెట్టమంటే పెట్టలేదని ఫీల్ అయిపోయిన అరియానా ఏకంగా ఆ తరువాతి వారంలో కరాటే కళ్యాణిని నామినేట్ చేసి ఇంటికి పంపేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో తమ తొమ్మిదవ స్టోర్‌ ప్రారంభంతో కార్యకలాపాలను విస్తరించిన యమ్మీ బీ

మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ గుడ్ న్యూస్, 2 ఎలక్ట్రిక్ బస్సులు ఉచితం

టీడీపీ కూటమి సర్కారు చాప్టర్ క్లోజ్... ఈ సారి వచ్చేది ప్రజాశాంతి పార్టీనే : కేఏ పాల్

సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే పార్టీలో చేరాను : విజయశాంతి

పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా... ఎవరికీ చెక్ పెడతామండీ : మంత్రి నాదెండ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

తర్వాతి కథనం
Show comments