Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పల్లవి ప్రశాంత్.. శివాజీకి కాఫీ పౌడర్

సెల్వి
మంగళవారం, 19 మార్చి 2024 (20:54 IST)
బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. బిగ్‌బాస్‌ నుంచి వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం రైతులకు పంచుతాను.. అన్న మాటను నిలబెట్టుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకి తొలి సాయాన్ని అందజేశానంటూ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు పల్లవి ప్రశాంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో శివాజీ, భోలే షావలి, ఆట సందీప్ కూడా ఉన్నారు. 
 
ఇక శివాజీ చేతుల మీదుగా ఓ రైతు కుటుంబానికి రూ. లక్ష ఇప్పించాడు ప్రశాంత్. అలానే ఒక సంవత్సరానికి సరిపడా బియ్యం కూడా అందజేశాడు. ఇదే విషయాన్ని పోస్ట్ చేస్తూ "ప్రాణం పోయినా మాట తప్పను.. మీకు ఇచ్చిన మాట కోసం ముందుగా చేసిన సహాయం" అంటూ రైతు బిడ్డ చెప్పాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తిట్టిన నోటితోనే రైతుబిడ్డను పొగుడుతున్నారు. ఇలానే మిగిలిన ప్రైజ్ మనీ మొత్తం రైతులకి ఇచ్చెయ్ అన్నా అంటూ గుర్తు చేస్తున్నారు. 
 
ఎప్పటికైనా అల్లు అర్జున్ ను కలుస్తానని పల్లవి ప్రశాంత్ వెల్లడించారు.  బిగ్ బాస్ హౌస్ ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అసెంబ్లీకి, పార్లమెంట్ కు వెళ్లే ఛాన్స్ వస్తే వదులుకోనని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు. కాగా తన గెలుపుకు కారణమైన శివాజీకి పల్లవి ప్రశాంత్ ఒక విలువైన బహుమతి ఇచ్చాడు. 
 
అది ఏమిటో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. పల్లవి ప్రశాంత్ గురుదక్షిణగా శివాజీకి కాఫీ పౌడర్ ఇచ్చాడు. ఇది విలువైన బహుమతా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. బిగ్ బాస్ ఆడియన్స్ కి శివాజీకి కాఫీ ఎంత విలువైనదో బాగా తెలుసు. హౌస్‌లో శివాజీ కాఫీ కోసం నానా రచ్చ చేశాడు. కాఫీ పౌడర్ పంపితేనే హౌస్లో ఉంటా లేదంటే వెళ్ళిపోతానని ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments