Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బిగ్ బాస్-6"లో మొదటి కంటెస్టెంట్‌.. కీర్తి భట్ గురించి తెలుసా?

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (19:31 IST)
keerthy bhatt
"బిగ్ బాస్-6"లో మొదటి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి భట్. పలు తెలుగు సీరియల్స్ ద్వారా ఈమె ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా 'కార్తీక దీపం' సీరియల్‌లో హిమ అనే అమాయకపు అమ్మాయి పాత్ర పోషిస్తుంది. కీర్తి భట్ పూర్తి పేరు కీర్తి కేశవ్ భట్. 1992 వ సంవత్సరం జూన్ 2న మంగళూర్లో జన్మించింది. 
 
ఈమె విద్యాభ్యాసం అంతా బెంగుళూరులో జరిగింది. ఓ యాక్సిడెంట్‌లో తల్లిదండ్రులతో పాటు తోబుట్టువులను కోల్పోయింది. మూడు నెలలపాటు తను కోమాలో ఉండిపోయింది. ఈమె ఫ్యామిలీలో ఎవ్వరూ మిగల్లేదు. ఈమె చాలా వరకు ఒంటరిగానే జీవిస్తోంది. 
 
తనలాంటి పరిస్థితి శత్రువుకి కూడా రాకూడదు అని ఆమె ఎమోషనల్‌గా హౌస్‌లోకి వెళ్ళే ముందు చెప్పుకొచ్చింది. 2017 వ సంవత్సరంలో రూపొందిన కన్నడ చిత్రం 'ఐస్ మహల్' తో ఈమె నటిగా మారింది. 
 
కీర్తి భట్ ఒక మోడల్ కూడా. కానీ మోడలింగ్ రంగంలోకి ఉన్నన్ని రోజులు ఈమెకు అవకాశాలు రాలేదు. తెలుగులో ఈమె 'మనసిచ్చి చూడు' సీరియల్‌తో అడుగుపెట్టింది. 
 
ఆ తర్వాత కార్తీకదీపం సీరియల్‌లో నటించే ఛాన్సును కైవసం చేసుకుంది. ఇంకా ఓ పాపను కూడా అడాప్ట్ చేసుకుంది. ఆమె పేరు తను భట్. కీర్తి భట్.. భరతనాట్యం డాన్సర్ కూడా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments