Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bigg Boss 4 Telugu Winner అభిజీత్, ఓటమిని జీర్ణించుకోలేని అఖిల్ ఇంట్లో ఆ పనిచేస్తున్నాడట

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (09:26 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
నిన్న రాత్రి నరాలు తెగే ఉత్కంఠ. కోట్లాది మంది ప్రేక్షకులు టివీలకు అతుక్కుపోయి గంటల తరబడి టివిలను చూస్తూ కూర్చుండిపోయారు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రేక్షకులందరూ కూడా బిగ్ బాస్ ఫినాలే విజేత ఎవరని ఆసక్తిగా చూడడం ప్రారంభించారు.
 
అయితే చివరకు విన్నర్ అభిజిత్ కాగా, రన్నరప్‌గా అఖిల్ మిగిలిన విషయం తెలిసిందే. అయితే హౌస్‌లో చివరలో ఐదుగురిలో సోహైల్ ముందే 25 లక్షల రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది అభిజిత్, అఖిల్. అయితే వీరిద్దరిలో ఎవరు విన్నర్ అవుతారోనని అందరూ ఉత్కంఠతో చూస్తూ టీవీల ముందు కూర్చున్నారు.
 
కానీ ముందు నుంచి అఖిల్‌లో టెన్షన్ ఎక్కువగా కనిపించింది. నాగార్జున హౌస్ లోకి వెళ్ళి స్టేజ్ పైకి తీసుకువచ్చేటప్పటి నుంచి అఖిల్‌కు చేతులు, కాళ్ళు వణుకుతూనే ఉన్నాయి. స్టేజ్ పైకి వచ్చిన తరువాత కూడా ఎక్కువగా అఖిల్ టెన్షన్ పడ్డాడ. చివరకు అభిజిత్‌ను విన్నర్‌గా ప్రకటిస్తే ఆవేదనకు గురయ్యాడు అఖిల్.
 
తనను ప్రేక్షకులు ఇంత దూరం తీసుకువచ్చారు. రెండో స్థానంలో నిలబెట్టారు. ఇది కాస్త సంతోషంగా ఉందని మొదట్లో అఖిల్ చెప్పినా ఆ తరువాత ఇంటికి వెళ్ళారు. బిగ్ బాస్ స్టేజ్ నుంచి బయటకు వచ్చిన తరువాత తన అభిమానులు కూడా అభిజిత్ దగ్గరకు వెళ్ళి శుభాకాంక్షలు చెప్పడంతో అఖిల్ ఆవేదనకు గురయ్యాడట.
 
ఇంటికి వెళ్ళిన అఖిల్ ఇంట్లో తలుపులు మూసుకుని ఒంటరిగా కూర్చుండిపోయాడట. 106 రోజుల పాటు జరిగిన బిగ్ బాస్ షోలో తను అన్ని విధాలుగా ఆడినా గెలవలేకపోయాయన్న బాధ జీర్ణించుకోలేకపోతున్నాడట. తన కుటుంబ సభ్యులతో డిస్టబ్ చేయవద్దని తన గదిలోకి వెళ్ళి అఖిల్ సైలెంట్‌గా కూర్చుండిపోయాడట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాం : ఎయిర్ చీఫ్ మార్షల్

అపరిశుభ్రమైన - అసౌకర్యమైన సీటు కేటాయింపు - ఇండిగో సంస్థకు అపరాధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments