Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింపథి కోసం అరియానా మరీ ఇంతగా దిగజారాలా?

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (20:00 IST)
బిగ్ బాస్ హౌస్‌లో ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ. ఇప్పుడు సెలబ్రిటీలే అయినా.. మొదట్లో వారు మాత్రం సాధారణ వ్యక్తులే. అయితే అలాంటి వారిలో ఇప్పుడు ఎక్కువగా వినిపించే పేరు అరియానా గ్లోరి. 14 వారాల బిగ్ బాస్ హౌస్‌లో ఆమె ఏవిధంగా ఆటలాడిందో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆమె కొత్త పంథాను ఎంచుకుంది. తన నిజ జీవితంలో జరిగిన ఘటనలను ఆమె గుర్తు చేసుకుంటోంది. అసలు ఎందుకలా ఆమె చేస్తుందోనని విశ్లేషకులే ఆశ్చర్యపోతున్నారు. 
 
నా మొదటి జీతం 4 వేలు. ఒక చిన్న గదిలో నేను పడిన బాధలు అన్నీఇన్నీ కావు. బిగ్ బాస్‌కు వచ్చిన తరువాత బాగా పాపులర్ అయ్యాను అనుకుంటున్నాను. చాలామంది అభిమానులు నాకు సందేశాలు పంపుతున్నారని కంటెన్టెంట్లు చెబుతుండటం సంతోషంగా ఉంది. నన్ను బోల్డ్ అనుకుంటున్నారో లేకుంటే ఇండిపెండెంట్ ఉమెన్ అనుకుంటున్నారో నాకైతే తెలియడం లేదు. 
 
అస్సలు ఒక్కోసారి అనిపిస్తోంది.. నేను ఈ హౌస్‌కు అర్హురాలినా అని. ఈ 14 వారాలు మహారాణిలా ఉన్నాను. కంటెన్టెంట్లతో బాగా కలిసిపోయాను. నేను బిగ్ బాస్‌లో గెలవాలనుకుంటున్నాను. నాకు ఆ అవకాశం వస్తే బాగుండు అనిపిస్తోంది. ఒకవేళ హౌస్ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తే మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతాను అంటూ మరో రాగం అందుకుంది.
 
అయితే అరియానా సింపథి కోసమే ఇలా చేస్తోందంటూ ప్రచారం బాగానే సాగుతోంది. హౌస్‌లో మరికొన్ని రోజులు ఉండాలంటే అభిమానుల ఓట్లు తప్పనిసరి. కాబట్టి అరియానా తన జీవితంలో జరిగిన బాధలను చెప్పుకుని ఎమోషనల్‌గా ఫీలవుతూ అభిమానులందరినీ తనవైపు తిప్పుకుని ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తోందంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments