Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ మూడో సీజన్.. టాస్క్‌లు రిపీట్.. శ్రీముఖి తమ్ముడికి జోకర్.. ఒకటే ఏడుపు (వీడియో)

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (17:08 IST)
బిగ్ బాస్ మూడో సీజన్‌లో టాస్క్‌లు రిపీట్ అవుతున్నాయి. తాజాగా మునపటి సీజన్ల మాదిరే ఈ సీజన్‌లోనూ కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యుల్ని కలుసుకునే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఇంటికి దూరంగా బిగ్ బాస్ హౌస్‌కి వచ్చి సుమారుగా 60 రోజులు గడిచిన నేపథ్యంలో.. వారిని చూసే ఛాన్స్ ఇచ్చారు. ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్‌కి వచ్చారు. కానీ వాళ్లను డైరెక్ట్‌గా ఇంటి సభ్యుల్ని కలవకుండా వాళ్లకీ ఓ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. 
 
ఈ పది మందిలో ఇద్దరికి మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్లను కలిసే అవకాశం ఉందని అది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుందని వాళ్లకు ఇచ్చిన బాక్స్‌లలో బిగ్ బాస్ ఐ గుర్తు వచ్చిన వాళ్లు మాత్రమే ఇంటి సభ్యుల్ని కలిసే అవకాశం లభిస్తుందన్నారు. జోకర్ వస్తే తమ వాళ్లను కలకుండానే వెళ్లిపోవాలని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్.
 
అంటే ఈ 10 మందిలో ఐదుగురికి ఐ గుర్తు ఉన్న బాక్స్‌లు వస్తే మరో ఐదుగురికి జోకర్‌లు వస్తాయన్నమాట. ఈ ఐ గుర్తు వచ్చిన వాళ్లలో ఇద్దరికి మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇదిలా వుంటే.. ఇకపోతే.. తమ కుటుంబ సభ్యుల్ని చూసిన కంటెస్టెంట్స్ అపుకోలేనంత భావోద్వేగానికి లోనయ్యారు.


ముఖ్యంగా శ్రీముఖి తన తమ్ముడు సుసృత్‌ని చూసి గళగళ ఏడ్చేసింది. వాళ్లతో మాట్లాడకూడదు, చర్చించకూడదు అనే నిబంధన ఉన్నప్పటికీ శ్రీముఖి గట్టిగా ఏడ్చేసింది. శ్రీముఖి తమ్ముడికి బాక్స్‌లో జోకర్ వచ్చింది.
 
టాస్క్ ప్రకారం అతను శ్రీముఖిని కలవకుండానే బిగ్ బాస్ నుండి బయటకు వెళ్లిపోయాడు. ఇక జరగబోయే ఎపిసోడ్లో నాగార్జున బిగ్ బాస్ సభ్యులని నవ్విస్తాడో లేక పోతే తనదయిన శైలిలో స్వీట్ వార్నింగ్ ఇస్తాడో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments