Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BiggBossTelugu3 రెచ్చిపోయిన పునర్నవి.. ఆగస్టు 15న హౌస్‌లో సందడే సందడి..

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (12:27 IST)
స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న జరిగిన బిగ్ బాస్ మూడో సీజన్ ఎపిసోడ్ అదిరింది. స్కిట్లు, డ్యాన్సులతో సందడి చేశారు.. హౌస్ మేట్స్. ఇంకా హౌస్ మొత్తం భారత్ మాతాకి జై అనే నినాదాలతో హోరేత్తించింది. మొదట శ్రీముఖి, అలీలు యాంకర్లుగా బిగ్‌బాస్ హౌస్‌లో ఎంటర్టైనింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. 
 
ముందుగా స్త్రీ, పురుష సమానత్వంపై మహేష్, రవి, పునర్నవి, వితికా, ఆషు‌లు స్కిట్‌తో ఆకట్టుకున్నారు. ఆడవాళ్లు గొప్పా, మగవాళ్ల గొప్పా అన్ని విషయంపై కంటెస్టంట్స్ తమ అభిప్రాయాలను వివరించారు. మగవాళ్లు ఎంతమందితోనైనా మాట్లాడొచ్చని.. ఎవరితోనైనా ఉండొచ్చని రవి, మహేష్ లు తమ వాదన వినిపించగా వాళ్లకు కౌంటర్ ఇస్తూ అషు, వితికా చెలరేగిపోయారు.
 
నచ్చినట్లుగా ఇంట్లో ఉండలేమని, పెళ్లి అనే ఒక్క కారణంతో ఇష్టాలన్నింటినీ వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి అన్నింటినీ త్యాగం చేస్తామని అషు రెడ్డి తన వాదన వినిపించగా.. సమాజంలో ఆడపిల్ల ఎలా అణచివేయబడుతుందో ఎమోషనల్‌గా తెలియజేస్తూ ఆడవాళ్ల గొప్పతనం తెలియజేసింది వితికా.
 
ఇక సీన్‌లోకి ఎంటర్ అయిన పునర్నవి ఆడవాళ్లు ఎందుకు మాట్లాడకూడదు.. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎందులో తక్కువ అంటూ రెచ్చిపోయింది. ఒక అబ్బాయి వెళ్లి నలుగురు అమ్మాయిలతో మాట్లాడితే అది సోషలైజింగ్ అంటారు. అదే అమ్మాయి వెళ్లి అబ్బాయితో మాట్లాడితే.. క్యారెక్టర్ లెస్ అంటారు. ఇదీ అమ్మాయిలకు ఇచ్చే గౌరవం అంటూ ఆవేశంగా మాట్లాడింది. 
 
అమ్మాయి నలుగురు అమ్మాయిలతో మాట్లాడితే తప్పు అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు..? స్త్రీలను గౌరవించడం అంటే ఇదేనా అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం పునర్నవి స్పీచ్ గురించే సోషల్ మీడియాలో వాడీవేడిగా చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments