ప్రముఖ నటుడు, 'బిగ్‌బాస్ 2' కంటెస్టెంట్ అయిన సామ్రాట్ గురించి అందరికీ తెలిసిందే. 'ఆహా నా పెళ్ళంట' 'పంచాక్షరీ' 'దేనికైనా రెడీ' వంటి చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించిన సామ్రాట్ పలు వివాదాలతో బాగా పాపులర్ అయ్యాడు.
'బిగ్ బాస్ 2' షోలో ఓ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సామ్రాట్… గతంలో హర్షిత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత కొన్ని కారణాల వల్ల వీళ్ళు విడిపోయారు. ఇక కరోనా లాక్ డౌన్ టైంలోనే కాకినాడకు చెందిన అంజనా శ్రీలిఖిత అనే యువతిని సామ్రాట్ రెండో విహాహం చేసుకున్నాడు.
జూన్ నెలాఖరులో తన భార్య బేబీ బంప్ ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఆగస్టు 15న సామ్రాట్ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్ న్యూస్‌ను సామ్రాట్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు
కానీ తన కూతురు ఫోటోని మాత్రం చూపించలేదు. అయితే లేటెస్ట్‌గా సామ్రాట్ దంపతులు తమ ఫేస్‌ను చూపిస్తూ ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.